https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ ప్రైజ్

దర్శక ధీరుడు రాజమౌళి చెక్కే చెక్కుడుకు సినిమా ఎంత అపురూపంగా వస్తుందో ‘బాహుబలి’ సినిమాతో మనం చూశాం. ఇప్పుడు ఆ తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అంతకుమించిన సినిమాగా రూపొందుతోందని మేకింగ్ వీడియోతో తేటతెల్లమైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎన్టీఆర్, చరణ్ అభిమానులే కాదు.. దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. రాంచరణ్, తారక్, బ్రిటీష్ నటులు, శ్రియా, సముద్రఖని తదితరులు నటించిన మేకింగ్ వీడియో ఆద్యంతం కట్టిపడేస్తోంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2021 / 07:23 PM IST
    Follow us on

    దర్శక ధీరుడు రాజమౌళి చెక్కే చెక్కుడుకు సినిమా ఎంత అపురూపంగా వస్తుందో ‘బాహుబలి’ సినిమాతో మనం చూశాం. ఇప్పుడు ఆ తర్వాత తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అంతకుమించిన సినిమాగా రూపొందుతోందని మేకింగ్ వీడియోతో తేటతెల్లమైంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎన్టీఆర్, చరణ్ అభిమానులే కాదు.. దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

    రాంచరణ్, తారక్, బ్రిటీష్ నటులు, శ్రియా, సముద్రఖని తదితరులు నటించిన మేకింగ్ వీడియో ఆద్యంతం కట్టిపడేస్తోంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను సైతం ఈ వీడియోలో చూపించారు. సినిమా ఎలా ఉంటుందో ఈ యాక్షన్లతో తెలిసింది. సినిమా అంచనాలు అందేలా ఉంది.

    ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఈ వీడియోలో ప్రకటించింది.

    ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోతో ఖుషీగా ఉన్న అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట.. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను ఈ పాట ద్వారా ప్రజలకు తెలియజేసేలా చేయాలనే యోచనలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. మరి అది ఎప్పుడు విడుదలవుతుంది? ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.