నకిలీ డీఎస్పీని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంటర్ కూడా పాస్ కాలేదు కానీ డీఎస్పీ అని చెప్పుకున్నాడు. హంగూ ఆర్భాటంంతో సకల వసతులు కల్పించుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేశాడు. సెటిల్ మెంట్లకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఐడీ కార్డులతో డీఎస్పీగా అవతారమెత్తిన స్వామి తన ముఠాతో కలిసి కోటి రూపాయల వరకూ వసూళ్లు చేశాడు. పలువురు బాధితుల […]
Written By:
, Updated On : July 17, 2021 / 06:54 PM IST

ఇంటర్ కూడా పాస్ కాలేదు కానీ డీఎస్పీ అని చెప్పుకున్నాడు. హంగూ ఆర్భాటంంతో సకల వసతులు కల్పించుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేశాడు. సెటిల్ మెంట్లకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం తుజాల్ పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఐడీ కార్డులతో డీఎస్పీగా అవతారమెత్తిన స్వామి తన ముఠాతో కలిసి కోటి రూపాయల వరకూ వసూళ్లు చేశాడు. పలువురు బాధితుల ఫిర్యాదుతో దర్యప్తు చేపట్టిన కామారెడ్డి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.