https://oktelugu.com/

Leo: ఆర్ఆర్ఆర్ రికార్డును అందుకున్న మరో సినిమా

సినిమా రిలీజ్ మరో రెండు రోజుల్లో ఉండనుండడంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు చిత్ర యూనిట్. దసరా కానుకగా రానుంది ఈ సినిమా. ఇందులో విజయ్ సరసన నటించనునంది త్రిష.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 17, 2023 / 02:27 PM IST

    Leo Movie

    Follow us on

    Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్. ఈయన సినిమా రాబోతుందంటే.. కోలీవుడ్ టాలీవుడ్ మాత్రమే కాదు అమెరికాలో కూడా ఆయనకు ఉన్న అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లియో. గతంలోనే వీరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించింది. అందుకే ఇప్పుడు లియో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    సినిమా రిలీజ్ మరో రెండు రోజుల్లో ఉండనుండడంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు చిత్ర యూనిట్. దసరా కానుకగా రానుంది ఈ సినిమా. ఇందులో విజయ్ సరసన నటించనునంది త్రిష. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాను వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హైప్ ను క్రియేట్ చేసి అదే తరహాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఇప్పటికే యూఎస్ లో భారీ రికార్డును సొంతం చేసుకుందట లియో సినిమా. మన టాలీవుడ్ గ్లోబల్ హిట్ ”ఆర్ఆర్ఆర్’‘ సినిమా తర్వాత మళ్ళీ ఈ రికార్డును క్రియేట్ చేసిన ఏకైక మూవీ లియో అని అక్కడి డిస్టిబ్యూటర్ల టాక్. అయితే యూఎస్ లో కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకున్న ఏకైక సినిమాగా లియో నిలిచినట్టు సమాచారం. ఇన్నేళ్ళలో లియో సినిమానే ఈ రికార్డ్ నెలకొల్పింది.ఇప్పుడే ఈ రికార్డును సొంత చేసుకున్న లియో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి మరీ.