Vijay Sethupathi : కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ల సినిమాలు రాబోతున్నాయి అంటే ప్రేక్షకులు చాలా సంతోషిస్తారు. వారి సినిమాల గురించి ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం అట్లీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. ఈయన తెరకెక్కించిన సినిమా జవాన్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా రూ. 1,148.32 కోట్లను రాబట్టి సంచలనం సృష్టించింది. విడుదలైన తర్వాత ఎన్నో రోజులు సినిమా వార్తల్లో నిలిచింది.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తన వర్క్, డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఇక జవాన్ విడుదలైనప్పటి నుంచి, అభిమానులు అతని తదుపరి ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు కూడా అదే ఎగ్జైట్మెంట్ ను అందించడానికి కొన్ని అప్డేట్ లతో వస్తుంటాడు ఈ డైరెక్టర్. ఈయన తన తదుపరి చిత్రాన్ని వరుణ్ ధావన్ తో చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో బేబీ జాన్ రాబోతుంది. ఈ చిత్రానికి కాలీస్ దర్శకత్వం వహించనుండగా, అట్లీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా మాత్రమే కాదు మరొక సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు అట్లీ. అందులో హీరో ఎవరో ఊహించండి. అదేనండి ఎంతో మంది ఇష్టపడే విజయ్ సేతుపతి నటించనున్నారట. అట్లీ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు. అయితే అట్లీ జవాన్ లో విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతిని ఈ సినిమాలో హీరోగా చేయనున్నారు.
ఈ ప్రకటన అభిమానుల్లో, సినీ పరిశ్రమలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. అట్లీ, విజయ్‌ల కలయికలో రానున్న తమిళ సినిమా ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ఏకం చేస్తూ ఒక ప్రధాన నిర్మాణంగా భావిస్తున్నారు. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ యాక్షన్ చిత్రం బేబీ జాన్ ప్రచార కార్యక్రమంలో, అట్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వివరాలను వెల్లడించారు. నడువుల కొంజం పక్కత కానోమ్ సినిమాతో ఫేమస్ అయిన బాలాజీ తరణీధరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు జరుగుతున్నాయని.. స్క్రిప్ట్ ఇటీవలే ఖరారైందని కూడా అట్లీ పేర్కొన్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రానికి అద్భుతమైన తారాగణం వచ్చే అవకాశం ఉందని, ఈ సినిమా గ్రాండ్ సెలబ్రేషన్‌గా ఉంటుందని అట్లీ అభిమానులతో పంచుకున్నారు. అయితే, కథాంశం, నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి.