Homeఆంధ్రప్రదేశ్‌Tirumal : కొత్త సంవత్సరం వేళ శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లోనే క్యాలెండర్లు, డైరీలు లభ్యం

Tirumal : కొత్త సంవత్సరం వేళ శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లోనే క్యాలెండర్లు, డైరీలు లభ్యం

Tirumal :  తిరుమల తిరుపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ఏడాదిలో ఏ రోజు వెళ్లిన కూడా భక్త జనసందోహం ఉంటారు. దాదాపుగా 24 గంటలు కూడా వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక్క సెకను దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరి వెళ్లి శ్రీవారిని భక్తులు దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా దర్శనం, టోకెన్లు, గదులు ఇలా అన్నింట్లో కూడా మార్పులు చేస్తోంది. భక్తులు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను తీసుకొస్తుంది. అయితే 2025 సంవత్సరం వచ్చేస్తుంది. ఇంకో పది రోజుల్లో ఈ ఏడాది పూర్తి కాబోతుంది. దీంతో అందరూ కూడా కొత్త క్యాలెండర్లు, డైరీలు కొనుగోలు చేస్తుంటారు. అధ్యాత్మికంపై ఆసక్తి ఉన్నవారు సాధారణ డైరీలు, క్యాలెండర్ల కంటే దేవునివి కొనుగోలు చేయాలనుకుంటారు. అందులోనూ శ్రీవారి క్యాలెండర్లు, డైరీలకు అయితే మంచి డిమాండ్ ఉంటుంది. కానీ వీటిని తిరుపతి వెళ్లి కొనుగోలు చేయలేరు కదా. అందుకే భక్తుల సౌకర్యార్థం కోసం ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది.

వచ్చే ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్, ఆన్‌లైన్‌లో భక్తులకు విక్రయిస్తోంది. అది కూడా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భక్తులకు అవకాశం కల్పిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించిన 12 పేజీల క్యాలెండర్, అలాగే 6 పేజీల క్యాలెండర్‌తో పాటు టేబుల్ టాప్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలు, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఇద్దరు ఉన్న క్యాలెండర్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి, తిరుమల, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరుతో పాటు మరో కొన్ని ప్రధాన కళ్యాణ మండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.

ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలని అనుకునేవారు ప్రధాన నగరాల్లో ఉన్న స్టోర్ దగ్గరకు వెళ్లి తీసుకోవచ్చు. అదే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వీరికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా డైరెక్ట్‌గా ఇంటి దగ్గరకే వస్తాయి. టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలను www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెద్ద డైరీ ధర రూ.150గా.. చిన్న డైరీ ధర రూ.120గా టీటీడీ నిర్ణయించింది. 12 షీట్ల క్యాలెండర్ ధర రూ.130గా, టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75గా టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీటీడీ తెలిపింది

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version