Crazy Multistarrer: ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. రాజమౌళి పుణ్యమా అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి నటించి అద్భుతమైన హిట్ ను అందుకున్నారు. అందుకే ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్స్ వైపే చూస్తున్నారు. క్రేజీ కథలో క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్లు ఉంటే.. నేషనల్ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది.

రాజమౌళి ఎలా అయితే ‘ఎన్టీఆర్ కి – చరణ్ కి’.. ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడో.. అలాగే తాము సక్సెస్ అవుతాం అని భావిస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. దాంతో ముందు ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. పైగా కొందరు మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
Also Read: Fans Surprised NTR At Mubai: వాళ్ళ అభిమానం ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది
ఎలాగూ బోలెడు అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ ఓ స్క్రిప్టు తో రెడీ గా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లను తన కథలో హీరోలుగా పెట్టుకోవాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టు ఇప్పటికే వీరిద్దరికి కథ కూడా వినిపించాడట.

హీరోలిద్దరూ ఇప్పటికే కథ విని ఓకే చెప్పారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ విజయ్ దేవరకొండ – విజయ్ సేతుపతి కలిసి నటిస్తే ఆ సినిమా కచ్చితంగా భారీ ఇండియన్ సినిమాగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ ఇద్దరు హీరోలకు బలమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే మేకర్స్ ఈ కలయిక పై ఫుల్ నమ్మకం తో ఉన్నారు.
అన్నిటికీ మించి ఇద్దరూ మంచి నటులు. ఇద్దరు అన్నదమ్ముల మీద ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారి వారి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ మల్టీ స్టారర్ సినిమా పై దృష్టి పెడతారని తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ – విజయ్ సేతుపతి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
Also Read:Rashmika Mandanna Diet Secrets: రష్మిక అందం వెనుక ఉన్న ‘డైట్’ సీక్రెట్ ఇదే