https://oktelugu.com/

KGF2: కేజీఎఫ్ 2కు పోటీగా వస్తున్న మరో సినిమా..!

KGF2: కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కింది. కరోనా కారణంగా పలుసార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా పూర్తి కావడంతో ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కేజీఎఫ్-1 ఘన విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్-2’ను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 17, 2022 / 10:50 AM IST
    Follow us on

    KGF2: కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కింది. కరోనా కారణంగా పలుసార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా పూర్తి కావడంతో ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

    కేజీఎఫ్-1 ఘన విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్-2’ను భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ అన్ని కూడా అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. హీరో యశ్ పై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజు అవుతుందా? అని యశ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమాలన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలను తమ రిలీజ్ డేట్స్ పోస్టుపోన్ చేసుకొని సమ్మర్ కు రావాలని సన్నహాలు చేసుకుంటున్నాయి. కేజీఎఫ్-2 రిలీజు సమయంలో బడా సినిమాలేవీ పోటీ లేకుండా సేఫ్ డేట్ ను మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.

    అయితే అదేరోజున బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజు కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కేజీఎఫ్-2కు పోటీగా అమీర్ ఖాన్ సినిమా రావడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ఈ రెండింటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.