https://oktelugu.com/

Ram Charan – Shankar: చరణ్ – శంకర్ పై క్రేజీ అప్ డేట్.. బజ్ ఓకే, రిజల్ట్ ఏమిటి ?

Ram Charan – Shankar: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూలై 1 నుంచి అమృత‌స‌ర్‌ లో స్టార్ట్ కానుంది. ఐదు రోజుల పాటు అక్క‌డ షూటింగ్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌ లో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని, నటుడు సునీల్ త‌దిత‌రులు పాల్గొనబోతున్నారు. అమృత‌స‌ర్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2022 / 02:20 PM IST
    Follow us on

    Ram Charan – Shankar: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూలై 1 నుంచి అమృత‌స‌ర్‌ లో స్టార్ట్ కానుంది. ఐదు రోజుల పాటు అక్క‌డ షూటింగ్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌ లో రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వాని, నటుడు సునీల్ త‌దిత‌రులు పాల్గొనబోతున్నారు.

    Ram Charan – Shankar

    అమృత‌స‌ర్‌ షెడ్యూల్ త‌ర్వాత మ‌ళ్లీ చిత్రబృందం రామోజీ ఫిల్మ్ సిటీకే రానుంది. అక్క‌డ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో రామ్ చ‌ర‌ణ్‌పై యాక్షన్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఏది ఏమైనా చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. మరో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చింది. అందుకే, కార్తిక్ సుబ్బరాజ్ కథనే సినిమాగా చేస్తున్నారు శంకర్.

    Also Read: Amala Paul: మెగా హీరోల పుణ్య‌మా అని క్రేజ్ తెచ్చుకుంది.. ఇప్పుడేమో ఛాన్స్ ల కోసం ఇలా.. !

    రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింత రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు.

    Ram Charan – Shankar

     

    ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది. మరి, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

    మొత్తానికి గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. ఎలాగూ ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read:Samantha Item Song: సమంత మరో ఐటమ్ కి సిద్ధం.. ఈ సారి పరిధి దాటుతుంది !

    Tags