https://oktelugu.com/

Mukku Avinash: ముక్కు అవినాష్ కూడా హీరో అయిపోయాడోచ్… దర్శకుడు ఎవరో తెలుసా?

సుడిగాలి సుధీర్ స్టార్ హీరో హోదాపై కన్నేశాడు. అతడు హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు వంటి చిత్రాలు విడుదలయ్యాయి. గాలోడు మూవీతో మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

Written By: , Updated On : September 23, 2023 / 02:00 PM IST
Mukku Avinash

Mukku Avinash

Follow us on

Mukku Avinash: తెలుగులో జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. ఈ షో వేదికగా స్టార్స్ అవతరించారు. క్లాస్ మాస్ బేధం లేకుండా హాస్య ప్రియులను ఏళ్ల తరబడి జబర్దస్త్ అలరించింది. ప్రతిరోజూ యూట్యూబ్ లో కొన్ని జబర్దస్త్ వీడియోలు చూడటం జనాలకు ఆనవాయితీగా ఉండేది. స్టార్స్ అందరూ వెళ్ళిపోయాక జబర్దస్త్ కి ఆదరణ తగ్గింది. మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ స్టార్ కమెడియన్స్ గా వెండితెరపై రాణిస్తున్నారు. కొందరైతే హీరోలయ్యారు.

సుడిగాలి సుధీర్ స్టార్ హీరో హోదాపై కన్నేశాడు. అతడు హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు వంటి చిత్రాలు విడుదలయ్యాయి. గాలోడు మూవీతో మొదటి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. రెండు మూడు చిత్రాలు అతడు హీరోగా తెరకెక్కుతున్నాయి. గెటప్ శ్రీను అటు కమెడియన్ గా రాణిస్తూనే రాజు యాదవ్ టైటిల్ తో హీరోగా ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ లిస్ట్ లో ముక్కు అవినాష్ చేరాడు.

ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో ముక్కు అవినాష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సీనియర్ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టగా, రచయిత కోనా వెంకట్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రానికి రాకేష్ దుబాసి దర్శకుడు. డక్కన్ డ్రీమ్స్ వర్క్స్ బ్యానర్ పై నబీ షేక్ నిర్మిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ టైటిల్ చాలా క్యాచీగా, ఫన్నీగా ఉంది. ఫస్ట్ లుక్ సైతం ఆకట్టుకుంది.

మరి హీరోగా ముక్కు అవినాష్ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి. అవినాష్ కెరీర్ బిగినింగ్ ఇతర జబర్దస్త్ లీడర్స్ వద్ద పని చేశాడు. తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. కెవ్వు కార్తీక్ తో పాటు ముక్కు అవినాష్ టీమ్ లీడర్ గా వ్యవహరించారు. 2020లో అవినాష్ జబర్దస్త్ మానేశాడు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. సీజన్ 4లో పార్టిసిపేట్ చేసిన అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అధిక వారాలు హౌస్లో ఉన్నాడు .