Swag Movie Review: స్వాగ్ ఫుల్ మూవీ రివ్యూ…

'సామజవరగమన ' సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన అదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు మరొక సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన 'స్వాగ్ ' సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : October 4, 2024 10:20 am

Swag Movie Review

Follow us on

Swag Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరిలో శ్రీ విష్ణు చాలా డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ సినిమాలు గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందుకే ఆయనకు ఇతర హీరోలతో పోల్చుకుంటే మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన గత సినిమాల కంటే కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. అందుకే ఆయన ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక గత సంవత్సరం ‘సామజవరగమన ‘ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన అదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు మరొక సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ‘స్వాగ్ ‘ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ‘స్వాగ్ ‘ అనే ఒక వంశానికి చెందిన ఆస్తిని సంపాదించుకోవడానికి రెండు జెండర్స్ (ఆడ, మగ) మధ్య కొంత పోటీ అయితే ఎదురవుతుంది. ముఖ్యంగా ఆ రెండు జెండర్స్ మధ్య జరిగే సంఘర్షణలో ఎవరికి ఆ వంశం తాలూకు ఆస్తి దక్కింది అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు… మగ,ఆడ రెండు జెండర్స్ లో ఎవరు విజయం సాధించారు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే సినిమా దర్శకుడు అయిన హసిత్ గోలి ఇంతకు ముందు శ్రీ విష్ణు తో ‘రాజ రాజ చోర’ అనే సినిమా చేశాడు. మొదటి సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో తన రెండో సినిమాను కూడా శ్రీ విష్ణు తో చేసి మంచి సక్సెస్ ని సాధించాలనుకున్నాడ. ఇక తను అనుకున్నట్టుగానే ఈ కథని చాలా డిఫరెంట్ వేరియేషన్ లో రాసుకొని సినిమాని ఆధ్యాంతం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. తను పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో స్క్రీన్ మీద కూడా అలాంటి ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి ఆయన మొదటి నుంచి చాలా ప్రయత్నం అయితే చేశాడు.

ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకెళ్లి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక భారీ ట్విస్ట్ ఇచ్చి వదిలేసాడు. ఇక సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ చేస్తాడు అని అనుకున్నప్పటికీ చాలా డీసెంట్ గా స్టార్ట్ చేసి సినిమాని మరొక యాంగిల్ లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో సినిమాని ఎంటర్టైనింగ్ గా ముగించాలనే ప్రయత్నం చేశాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ ఫుల్ గా నిలిచిందనే చెప్పాలి. ఎమోషన్ కామెడీ సమపాలలో రంగరించి తెరకెక్కించిన విధానం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఒక ఎమోషనల్ సీన్లలో ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది.

శ్రీ విష్ణు మొదటి నుంచి డిఫరెంట్ కథలను చేస్తాడనే ఒక పేరైతే ఉంది. తాను ఈ సినిమాలో కూడా అలాంటి పాత్ర నే పోషించి మరొకసారి తన పేరును నిలబెట్టుకున్నాడనే చెప్పాలి… సెకండ్ హాఫ్ లో మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు లాగైనప్పటికీ ఓవరాల్ గా సినిమా మాత్రం ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఈ వీకెండ్ ఫ్యామిలీతో సినిమా చూడాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండటం విశేషం. ముఖ్యంగా డైరెక్టర్ హసిత్ గోలి తను అనుకున్న పాయింట్ ను బలంగా నమ్మి ముందుకు సాగడం అనేది ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవచ్చు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. నాలుగు పాత్రల్లో కనిపించిన ఆయన తనదైన రీతిలో నటించి మెప్పించడానికి మొదటి నుంచి చాలా ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. ఇక ఇందులో ఆయన సక్సెస్ కూడా సాధించారనే చెప్పాలి. ఆయన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో చేసే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంది. అందుకే ఆయనలో తెలియని డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఈ సినిమాలో మనకు కనిపించింది. మొదటి నుంచి ఆయన చేస్తున్న సినిమాలు పక్కన పెడితే ఈ సినిమా మాత్రం ఆయనకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టే సినిమా అనే చెప్పాలి…

ఇక రీతు వర్మ కూడా ఒక ఐకానిక్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటన ఏ విధంగా ఉందో ఈ సినిమాని చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే శ్రీ విష్ణును ఎదుర్కొనే కొన్ని సీన్లలో ఆమె తన నట విశ్వరూపాన్ని చూపించింది… ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను లాంటివారు కూడా ఆ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ క్యారెక్టరైజేశన్ ఉండటం వల్ల వాళ్ల వాళ్ల నటన చాలా ఫ్రెష్ గా అనిపించడమే కాకుండా సినిమా చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆక్టివిటీ అనేది చాలా బాగా నచ్చుతుంది…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా కోసం దర్శకుడు పడిన కష్టానికి వివేక్ సాగర్ తన మ్యూజిక్ రూపంలో భారీగా హెల్ప్ చేశాడు. ఇక మొత్తానికైతే ఆయన అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రాఫర్ అయిన వెధరమన్ శంకరన్ విజువల్స్ తో కూడా ఈ సినిమా టాప్ లెవల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కొన్ని షాట్స్ లో చేంజ్ ఓవర్ చాలా బాగా చూపించాడు. ఇక కథ పరంగా వచ్చే చేంజ్ ఓవర్స్ ని కూడా తను విజువల్ గా చూపించినప్పుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే విప్లవ్ నిషధం తన ఎడిటింగ్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ ని పెంచినప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి. వాటిని కూడా షార్ప్ ఎడిట్ కట్ చేసి ఉంటే మాత్రం సినిమా మరింత గ్రిప్పింగ్గా వచ్చి ఉండేది. ఇక ఓవరాల్ గా ఈ సినిమాకి మాత్రం మంచి కాస్ట్ అండ్ క్రూ దొరకడం వల్లే ఈ సినిమా భారీ రేంజ్ లో వచ్చిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ప్లస్ పాయింట్స్

శ్రీ విష్ణు
స్క్రీన్ ప్లే
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది.
అక్కడక్కడ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు…

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్
ఈ వారం ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా