K.G.F Chapter 2: ‘కేజీఎఫ్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?

K.G.F Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా గురించి ఓ అప్‌ డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఒక కీలక పాత్రలో నటించింది అని తెలుస్తోంది. అన్నట్టు షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను కూడా ఈ సినిమా కోసం రీమేక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో యంగ్ […]

Written By: Shiva, Updated On : February 24, 2022 6:50 pm
Follow us on

K.G.F Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా గురించి ఓ అప్‌ డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఒక కీలక పాత్రలో నటించింది అని తెలుస్తోంది. అన్నట్టు షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను కూడా ఈ సినిమా కోసం రీమేక్స్ చేసిన సంగతి తెలిసిందే.

KGF 2

ఈ పాటలో యంగ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది అని తెలుస్తుంది. అయితే, ఈ పాట కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా ? లేక, అన్ని భాషల్లో ఉంటుందా ? అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమా గురించి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందట.

Also Read:  రామ్ పోతినేనితో పరిణితి చోప్రా రొమాన్స్.. నిజమేనా ?

నదియాది స్పై లాంటి పాత్ర. ఇక దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు.

K.G.F Chapter 2:

కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి.

nadhiya

ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించబోతుందట. మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది.

Also Read:  అక్కడ బాగా ఎంజాయ్ చేశాను అంటున్న కీర్తి సురేష్

Tags