Homeఎంటర్టైన్మెంట్Ram Charan heir naming event: రామ్ చరణ్ వారసుడి నామకరణ ఈవెంట్... స్పెషల్ గెస్టులుగా...

Ram Charan heir naming event: రామ్ చరణ్ వారసుడి నామకరణ ఈవెంట్… స్పెషల్ గెస్టులుగా రానున్న ఆ ఇద్దరు..?

Ram Charan heir naming event: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే అందరికి మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలైతే చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ నిలదొక్కుకున్న నటులు, దర్శకులు చాలామంది ఉన్నారు. తన అభిమానులు సైతం అతనితో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి… అలాంటి చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలను చేయడానికి సైతం తను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ సినిమాలో అతని నటనకి ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఫిబ్రవరి ఒకటోవ తేదీన రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టారు.

అందులో ఒకరు అబ్బాయి కాగా, మరొకరు అమ్మాయి కావడం విశేషం…ఇక మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడు అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ వారసుడికి నామకరణం జరిపి ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాదులోని ఒక ప్రముఖ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తారట…

ఈ ఈవెంట్ కి చాలామంది హీరోలు, హీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఈవెంట్ కి తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం ఇద్దరు చీఫ్ గెస్టులు గా హాజరు కాబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించి తన వారసుడి నామకరణ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు.

అతను పుట్టిన డేట్ అఫ్ బర్త్ ప్రకారం తనకు ఎలాంటి పేరైతే సూట్ అవుతుందో దానిని తెలుసుకొని మరి అదే పేరుని అతనికి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో చిరంజీవి చాలా క్లారిటీ గా ఉన్నాడు… ఈవెంట్ ఎప్పుడు జరుపుతున్నారు అనే విషయంలో సరైన డేట్ కుదరలేదు. మొత్తానికైతే ఈ నెలలోనే ఈ ఈవెంట్ జరిగే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News