Anni Manchi Sakunamule : ‘అలా మొదలైంది’ సినిమాతో ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా నందిని రెడ్డి తొలి సినిమాతోనే భారీ హిట్ ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె సిద్దార్థ్ మరియు సమంత ని పెట్టి ‘జబర్దస్త్’ అనే చిత్రాన్ని తీసింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించింది కానీ, 2019 వ సంవత్సరం లో సమంత తో తీసిన ‘ఓ బేబీ’ చిత్రం మాత్రమే భారీ హిట్ అయ్యింది.
తీసింది 5 సినిమాలే అయిన, సక్సెస్ లు తక్కువ ఉన్నా కూడా నందిని రెడ్డి మేకింగ్ స్టైల్ ని నచ్చే ఫ్యాన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో భారీ గానే ఉన్నారు.నేడు ఆమె దర్శకత్వం వహించిన ఆరవ సినిమా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యింది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఇప్పుడు చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని కానీ, ఓపెనింగ్స్ ని కొల్లగొట్టాలంటే కచ్చితంగా టీజర్ మరియు ట్రైలర్ సెన్సేషన్ అవ్వాలి, కనీసం ఒకటి రెండు పాటలైనా హిట్ కొట్టాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్స్ కి కదిలే సాహసం చేస్తున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత ట్రెండ్ ఇలా మారిపోయింది.’అన్నీ మంచి శకునములే’ చిత్రానికి అదే లోపించింది.మంచి టీజర్ మరియు ట్రైలర్ అయితే వదిలారు, ఆడియన్స్ కి కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే చూడాలి అనిపించేంతలా మాత్రం లేదు.
దానికి తోడు టాక్ కూడా డివైడ్ గానే రావడం తో మొదటి ఆట నుండే ఆక్యుపెన్సీలు లేవు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రబ్బత్తిందని చెప్తున్నారు.వరుస ఫ్లాప్స్ తో డీలా పడిన సమ్మర్ బాక్స్ ఆఫీస్ కి మరో డిజాస్టర్ ఫ్లాప్ తగిలిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.