SP Balu: రజినీకాంత్ కోసం ‘ఎస్పీ బాలు’ చివరి పాట.. వైరల్

టాలీవుడ్, కోలీవుడ్ , కన్నడ, మలయాళం ఇలా అందరి హీరోలకు తన గాత్రంతో వరుస హిట్ సినిమాలను అందించాడు ఎస్పీ బాలు. రెండు మూడు దశాబ్ధాల పాటు అందరి హీరోల పాటలను ఎస్పీ బాలునే పాడేవారు. చాలా మంది సూపర్ హీరోస్ కావడానికి బాలు గొంతు, పాటలు కూడా కారణం. ఎస్పీ బాలు మరణం తర్వాత ఆయన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆయన మరణానికి ముందు చివరిసారిగా ఓ స్టార్ హీరో కోసం ఓ పాట […]

Written By: NARESH, Updated On : October 5, 2021 3:36 pm
Follow us on

టాలీవుడ్, కోలీవుడ్ , కన్నడ, మలయాళం ఇలా అందరి హీరోలకు తన గాత్రంతో వరుస హిట్ సినిమాలను అందించాడు ఎస్పీ బాలు. రెండు మూడు దశాబ్ధాల పాటు అందరి హీరోల పాటలను ఎస్పీ బాలునే పాడేవారు. చాలా మంది సూపర్ హీరోస్ కావడానికి బాలు గొంతు, పాటలు కూడా కారణం.

ఎస్పీ బాలు మరణం తర్వాత ఆయన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆయన మరణానికి ముందు చివరిసారిగా ఓ స్టార్ హీరో కోసం ఓ పాట పాడాడు. బాలు పాటిన ఆఖరి పాట అదే. ప్రస్తుతం అది ట్రెండింగ్ లో ఉంది.

రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘అన్నాత్త’. నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లు. ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఎస్పీ బాలు ఒక పాట పాడారు. ఇదే ఆయన రజినీకాంత్ కోసం చివరిగా పాడిన పాట.. ఈపాటపై తాజాగా రజినీకాంత్ ట్వీట్ చేశాడు.

‘నాలుగు దశాబ్ధాల పాటు ఎస్పీ బాలు నా స్వరంగా జీవించారు. నా కోసం పాడిన ఈ పాటే ఆయన ఆఖరి పాట అవుతుందని కలలో కూడా ఊహించలేదు’ అని రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు.

‘అన్నాత్తే’ సినిమాలో ఎస్పీబాలు ఒక మాస్ పాట పాడాడు. చాలా హుషారుగా ఆలపించారు. రజినీకాంత్ ఫ్యాన్స్ ఈ పాట బాగుందని వైరల్ చేస్తున్నారు. ఎస్పీబీకి ఘన నివాళులర్పిస్తున్నారు.

ఇటీవల రజినీకాంత్ సినిమాలకు ఎస్పీ బాలు పాడిన పాటలు వైరల్ అయ్యాయి. పాడడం తగ్గించుకున్నాక కూడా రజినీకాంత్ సినిమాలకు మాత్రం ఆపలేదు బాలు. ఇప్పుడు అదే అది ఆఖరి పాట అవుతుందని ఎవరూ ఊహించలేదు.