దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. దీంతో సెలబట్రీలంతా ఇళ్లకే పరిమితమయ్యాయి. వాళ్లంతా ఫ్యామిలీతో కాలం గడుపుతున్నారు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో వాళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు. పలువురు సెలబ్రెటీలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా కొందరు హీరోయిన్లు అయితే హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిని పొగొడుతున్నారు. మరికొందరు యోగా, ఫిట్ నెస్, వంటలు, వైగరా వంటివి చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక తెలుగమ్మాయి అంజలి ఏకంగా కొత్త పార్టనర్ తన క్వారంటైన్లోకి రప్పించుకొని ఎంజాయ్ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.
ఈమేరకు అంజలి తన కొత్త పార్టనర్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగమ్మ పార్టనర్ పేరు షిహ్ జు(పొలో). ఇదొక పెంపుడు కుక్క. దీంతోనే అంజలి సమయం గడుపుతోంది. ఈ లాక్డౌన్లో తనకు పోలోతోనే ఆడుకోవడానికి సమయం సరిపోతుందని చెబుతోంది. ఫస్టు టైమ్ పోలో ఇన్ స్ట్రాగ్రామ్లోకి వచ్చిందంటూ అంజలి అభిమానులకు పోలోను పరిచయం చేసింది. మీరంతా కూడా క్వాలిటీ టైంతో గడపాలని అంజలికి సలహా ఇస్తుంది. తన పార్టనర్ తో అసలు బోరు కొట్టదని.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా అంజలి నటించిన నిశబ్దం మూవీ ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.