Anirudh Relationship with Kavya Maran..?: సౌత్ ఇండియా లో ప్రస్తుతం నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ముక్తకంఠంతో ప్రతీ ఒక్కరు చెప్పే పేరు అనిరుద్ రవిచందర్(Anirudh Ravichander). ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, తమ సినిమాకు అనిరుద్ ని తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా ఆయన డేట్స్ దొరకడం అంత ఆషామాషీ విషయం కాదు. ఒకేసారి డజను సినిమాలకు పైగా మ్యూజిక్ ని అందిస్తూ ఉంటాడు. సరైన సమయానికి ఔట్పుట్ రావడం కూడా కష్టమే. ఆయన ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అయినప్పటికీ నిర్మాతలకు అనిరుద్ యే కావాలి. ఆ స్థాయి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అంతే కాదు అనిరుద్ పై గాసిప్స్ కూడా ఎక్కువే. నిన్న మొన్నటి వరకు ఆయన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ పెళ్లి ద్వారా తెలిసింది.
Also Read: Kavya Maran : అభిషేక్ శర్మ తల్లిదండ్రులతో కావ్య మారన్ కు ఇంత బాండింగా?!
ఇప్పుడు ఆయన కళానిధి మారన్(Kalanidhi Maran) కూతురు, సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) టీం ఓనర్, కావ్య నిధి మారన్(Kavya Maran) తో 2024 వ సంవత్సరం నుండి ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారట. రీసెంట్ వీళ్లిద్దరు కలిసి ఒక రెస్టారంట్ లో జంటగా తమిళ మీడియా కి కనిపించడం, వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్తకు మరింత బలం చేకూర్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎందుకంటే కావ్య మారన్ కి మొదటి నుండి సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గెలిచినప్పుడు కానీ, ఓడినప్పుడు కానీ ఈమె ఇచ్చే రియాక్షన్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. అలాంటి అమ్మాయి సౌత్ లోనే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుందంటే ఆ మాత్రం సౌండ్ లేకుండా సోషల్ మీడియా ఎలా ఉంటుంది మీరే చెప్పండి.
ప్రస్తుతం అనిరుద్ ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీ గా ఉన్నాడు. కాస్త తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా చెప్తుంది. అనిరుద్ గురించి తెలియని విషయాలంటూ ఏది లేదు. కానీ తెలుగు వాళ్ళు ఇంకా ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాడని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి నిజం లేదు. అనిరుద్ ప్రముఖ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు. అతని తల్లి లక్ష్మి ఒక మంచి క్లాసికల్ డ్యాన్సర్. రవి రాఘవేంద్ర సోదరి లత. ఈమెనే సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Mahesh Babu) వివాహం చేసుకున్నాడు. అదే విధంగా అనిరుద్ తాత గారు సుబ్రహ్మణ్యం కూడా 1930 దశకం లో టాప్ మోస్ట్ ఫిలిం మేకర్. చూసారా ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాడో.