పేటీఎం సంస్థలో 120 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ ఏపీలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ప్రయోజనం చేకూరేలా పేటీఎం సంస్థలో ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ లో ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న […]

Written By: Navya, Updated On : July 26, 2021 2:45 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ ఏపీలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నుంచి ప్రయోజనం చేకూరేలా పేటీఎం సంస్థలో ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

ఆన్ లైన్ లో ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 26 చివరి తేదీగా ఉండగా అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. కస్టమర్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో పేటీఎం ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది.

18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటారో వారికి బైక్, డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. ఫ్రెషర్స్, ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు కర్నూల్ లో పని చేయాల్సి ఉంటుంది. 08518296308 నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 16,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.