Animal Twitter Review: రన్బీర్ కపూర్ లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రచారం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ కోసం జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నడిచాయి. ఒక బాలీవుడ్ చిత్రం కోసం తెలుగు ఆడియన్స్ ఇంతలా ఆరాటపడటం ఈ మధ్యకాలంలో లేదు. దీనికి ప్రధాన కారణం సందీప్ రెడ్డి వంగ దర్శకుడు కావడమే. అర్జున్ రెడ్డి మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ అంటూ వైలెంట్ మూవీతో వచ్చాడు.
యానిమల్ ట్రైలర్ ఆకట్టుకోగా హైప్ మరింత పెరిగింది. యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి, మహేష్ బాబు వంటి స్టార్స్ సందడి చేశారు. డిసెంబర్ 1న యానిమల్ విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
యానిమల్ పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కథలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో పాటు ఆద్యంతం అలరించే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి మార్క్ మేకింగ్ ఆకట్టుకుంది. రన్బీర్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అంటున్నారు. రన్బీర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆటం బాంబులా పేలిందని ఆడియన్స్ అభిప్రాయం. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ కలిగిస్తాయి.
హీరోయిన్ రష్మిక మందాన ఇంటెన్సిటీతో కూడిన ఓ రోల్ చేసింది. రొమాన్స్ తో పాటు ఎమోషన్స్ పలికించింది. విలన్ గా బాబీ డియోల్ టెరిఫిక్ గా ఉన్నాడు. ఆయన లుక్, రన్బీర్ కపూర్ తో పోరాటాలు అలరిస్తాయి. హర్షవర్ధన్ మహేశ్వర్ అందించిన బీజీమ్ సినిమాకు ప్లస్. సన్నివేశాలు ఎలివేట్ చేయడంలో బాగా హెల్ప్ అయ్యిందని అంటున్నారు.
మొత్తంగా యానిమల్ మూవీలో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే లెంగ్త్ ఎక్కువైందనేది ఒక మైనస్. ఏకంగా మూడు గంటల 20 నిమిషాల నిడివితో యానిమల్ మూవీ విడుదల చేశారు. ట్రిమ్ చేద్దామని కొందరు సలహా ఇచ్చినా వినలేదని సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. మరొక బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో పడినట్లు తెలుస్తుంది.
#Animal Decent 1st Half!
Though it feels lengthy at times, the film is engaging for the most part so far barring a few sequences. Ranbirs characterization works well even though there are similarities to AR. Interval action sequence is terrific!!. Sets up well for the 2nd half!
— Venky Reviews (@venkyreviews) December 1, 2023
#AnimalReview
1st half
5/5 all the way2nd half
4/5
Alpha male ni cheating chesa laga chesadu
Ranbir is excellent
Rashmika is good
Songs super
Fights super
Everything is new #Animalthefilm #Animal #AnimalMovie pic.twitter.com/e4EhbXwLwo— TEJA (@Teja_JP_) December 1, 2023
🌟🌟🌟🌟#RanbirKapoor𓃵 is phenomenal throughout! Every shot lo high ichadu💉
Performance at peaks🔥@imvangasandeep Vangaaaaa 🔥Swami niku dandammmmm🙏🏻🔥@iamRashmika is superb!!!!@thedeol Sshhhhhhhh!!!!🤫#AnimalMovie #AnimalMovieReview— Allu Jeevesh ™ (@jeeveshallu) December 1, 2023
#animalmovie positive talk💥#Animal #SandeepVanga
— B.v Rao (@Bvrao999) December 1, 2023