Animal Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(రాజమౌళి)…ఆయన తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ఆయన సినిమాల కోసం అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…
సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన అనిమల్ (Animal) సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే… బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ (Ranbeer Kapoor) హీరోగా చేయడం కూడా ఈ సినిమాకి కొంత వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక సందీప్ వంగ మేకింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలామంది దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డివంగ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలావరకు మార్పులు అయితే వచ్చాయి. ఒక సినిమాని ఎలా తీయాలి అలాగే ప్రేక్షకుడికి స్క్రీన్ మీద కనిపిస్తున్నదే కాక వాళ్లకు వినిపిస్తున్న సౌండ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు సందీప్ రెడ్డివంగా చాలా రకాల ప్రయత్నాలు చేసి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ను ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… అనిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అయితే ఈ పాత్ర కోసం మొదట మరొక హీరోని అనుకున్నారట. కానీ అనివార్య కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు.
Read Also: తల్లికి వందనం.. అర్హతలు ఇవే.. మార్గదర్శకాలు జారీ!
ఈ సినిమాలో మొదట తెలుగు స్టార్ హీరో అయిన రాజశేఖర్ ని విలన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర డిఫరెంట్ గా ఉండడంతో రాజశేఖర్ అయితే ప్రేక్షకులు అతన్ని ఆ పాత్రలో ఊహించుకోలేరేమో అనే ఉద్దేశ్యంతోనే సందీప్ వంగ తన నిర్ణయాన్ని మార్చుకొని బాబు డియోల్ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే అనిమల్ సినిమాని బాలీవుడ్ వాళ్ళు తొక్కేయాలనే ప్రయత్నం చేసినప్పటికి సందీప్ వాళ్లందరికీ కౌంటర్లు ఇస్తు ఎలాగైనా సరే తన సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో సినిమాని భారీ సక్సెస్ ని చేసి చూపించాడు. ఈ సినిమా దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి రన్బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది…
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయనకు గొప్ప గుర్తింపు వచ్చింది. ఇక మీదట కూడా ఆయనకు మంచి పేరు రావాలని తద్వారా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని ఆయన అభిమానులైతే కోరుకుంటున్నారు…