Animal Collections: బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన అనిమల్…ఎంత కలెక్ట్ చేసిందంటే..?

ముఖ్యంగా ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ మేకింగ్ బాగా ప్లస్ అయిందంటూ ఈ సినిమా గురించి సినీ మేధావులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ వసూలునైతే రాబట్టింది.

Written By: Gopi, Updated On : December 6, 2023 11:02 am

Animal Collections

Follow us on

Animal Collections: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ నటుడు అయిన రన్బీర్ కపూర్ హీరో గా వచ్చిన అనిమల్ సినిమా తనదైన రీతిలో మంచి సక్సెస్ ని సాదిస్తు ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తూ ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా 5 రోజులలోనే 7 లక్షల డాలర్లను వసూలు చేసింది. అయితే ఇంతకుముందు బాహుబలి 2 మాత్రం 5 లక్షల డాలర్లను వసూలు చేయగా ఆ రికార్డ్ ని కేవలం 5 రోజుల్లో మాత్రమే బ్రేక్ చేసి తన సత్తాను చాటుతుంది.

ముఖ్యంగా ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ మేకింగ్ బాగా ప్లస్ అయిందంటూ ఈ సినిమా గురించి సినీ మేధావులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ వసూలునైతే రాబట్టింది. ఇక ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో చూడాలి.ఇక ఇప్పటికే ఈ సినిమా 450 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ పండితులు సైతం తెలియజేస్తున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందని మరి కొందరు వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

ఏ ముహూర్తన సందీప్ రెడ్డి వంగ ఈ అనిమల్ సినిమాని మొదలు పెట్టాడో కానీ అప్పటినుంచి ఈ సినిమా హైప్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఇక రన్బీర్ కపూర్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా సైతం రన్బీర్ కపూర్ గురించి సందీప్ రెడ్డి వంగ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.నిజానికి సందీప్ ఒక తెలుగు డైరెక్టర్ అయి ఉండి బాలీవుడ్ లో తనదైన సత్తా చాటుతు ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో రన్బీర్ కపూర్ ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకడిగా చాలా ముందు వరుసలో నిలుస్తాడు.

ఈ సినిమాతో తనకి తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందంటూ ప్రతి ఒక్కరు తన యాక్టింగ్ గురించి మెచ్చుకుంటున్నారు… బాలీవుడ్ లో అంత పెద్ద విజయం సాధించిన అనిమల్ సినిమాను తీసిన డైరెక్టర్ మన తెలుగువాడు కావడం వల్ల తెలుగు వాళ్ళు కూడా ఆ సినిమాని మన సక్సెస్ గా ఎంజాయ్ చేస్తున్నారు…