Bobby Deol: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో చాలా సంవత్సరాల పాటు హీరో వెలుగొందిన ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక మొన్నటిదాకా సాంగ్స్ ఫైట్స్ అంటూ రొటీన్ సినిమా చేసుకుంటూ వచ్చిన చిరంజీవి ఇప్పుడు గేరు మార్చి వశిష్ట డైరెక్షన్ లో ఒక సోషయో ఫాంటసీ మూవీతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా విశ్వంభర సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే చిరంజీవి ఈ షూటింగ్ లో భాగంగా కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో వివిధ భాషల నుండి చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకున్నారని తెలుస్తుంది. అయితే అందులో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుండగా మరి కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనిమల్ సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబి డియోల్ ని విశ్వంభర సినిమా డైరెక్టర్ అయిన వశిష్ఠ సంప్రదించినట్లు గా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల నుంచి విశ్వంభర సినిమాలో ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలనే డైలమాలో ఉన్న డైరెక్టర్ అనిమల్ సినిమా చూసిన తర్వాత బాబి డియోల్ అయితే ఆ పాత్రకి బాగుంటాడని అతన్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది.
చిరంజీవికి పోటీగా ఆ క్యారెక్టర్ ఉంటుందా లేదా ఆ క్యారెక్టర్ చిరంజీవికి హెల్ప్ చేసే క్యారెక్టరా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాతో తెలుగులో ఆయన మొదటి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనక సక్సెస్ అయితే బాబీ డియోల్ కి తెలుగులో ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నిజానికి ఆయన చేసిన సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఆయనకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు లేవు ఎప్పుడైతే అనిమల్ సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన ఫేట్ మొత్తం మారిపోయింది ఇప్పటికే బాలీవుడ్ లో ఆయన దాదాపు పది సినిమాల వరకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.
ఇక తెలుగులో కూడా ఆయనకి చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన సెలెక్టెడ్ గా స్టోరీలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది… ఈయన అనిమల్ లో చేసిన అబ్రారార్ అనే క్యారెక్టర్ ఆయనకి చాలా గొప్ప క్రేజ్ తీసుకువచ్చింది. అందుకే ఆయనకి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇక ఈ సినిమాలతో ఒకప్పటి బాబీ డియోల్ మళ్ళీ బయటికి వచ్చాడు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు…