Sandeep Reddy Vanga: తెలుగులో చాలామంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే వాళ్ళ టేకింగ్ తో సినిమా రూపురేఖల్ని మార్చేసి ఆర్డినరీగా ఉన్న సినిమాలను ఎక్స్ ట్రా ఆర్డినరీ రేంజ్ లోకి తీసుకెళ్లి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటారు. అలాంటి దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళను గుర్తించడంలో మన హీరోలు చాలా వరకు వెనుకబడి పోతున్నారు.
అందుకే వాళ్ళు వేరే హీరోలతో సినిమాలు చేసి వేరే భాషల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అలాంటివాళ్ల లో సందీప్ రెడ్డివంగ ఒకరు ముందుగా సందీప్ అర్జున్ రెడ్డి సినిమా చేస్తానని స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏ ఒక్క నిర్మాత కూడా అతనికి సపోర్ట్ చేయలేదు ఇంకా దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఇక్కడ ఆడదు కావాలంటే బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తియి అక్కడ అయితే నీకు చాలా మంచి రీచ్ దొరుకుతుంది అంటూ ఆయనకు ఉచిత సలహాలను కూడా ఇచ్చారు. కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడు లాగా తెలుగులోనే ఆ సినిమాను చేసి సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యం తో వాళ్ళ అన్నయ్యని ప్రొడ్యూసర్ గా మార్చి అర్జున్ రెడ్డి సినిమా చేసి సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాని మొదటగా శర్వానంద్ కి చెప్పినప్పటికీ ఆయన ఇంత బోల్డ్ గా ఉన్న సీన్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశాడు. అయితే సందీప్ ఆ తర్వాత విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి ఒక సినిమా చేశాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయింది. ఇక దాంతో హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ తో ఈ సినిమాని రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అర్జున్ రెడ్డి సినిమాని మిస్ చేసుకున్నందుకు శర్వానంద్ ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు. అలాగే అనిమల్ స్టోరీని కూడా తెలుగులో చాలా మంది హీరోలకు చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో సినిమాని హిందీలో తీసి బ్లాక్ బస్టర్ హిట్టుని కొట్టాడు నిజానికి సందీప్ రెడ్డివంగ ఏదైతే అనుకుంటాడో అది డెలివరీ స్క్రీన్ పైన డెలివరీ చేస్తాడు. అయితే ఈ సినిమా కొంతమందికి బూతు, బోల్డ్ లాగా అనిపించిన మరి కొంత మందికి మాత్రం ఆ సినిమా అనేది చాలా రియల్ ఎస్టీక్ వే లో ఉంది దాంట్లో తప్పేముంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి మన నిజ జీవితంలో మనం ఎవరితో ఎలా మాట్లాడుతాం, ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుతాం, ఫ్యామిలీతో ఎలా మాట్లాడతాం పర్సనల్ టైం లో ఎలా ఉంటాం లవర్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటాం అని అన్ని సిచువేషన్స్ లో ఉండే క్యారెక్టర్లనే సినిమాలో క్యారెక్టర్లు గా రూపొందించుకుంటాడు.
దానివల్ల కొంతమందికి మన నిజజీవితంలో చూసిన క్యారెక్టర్లే మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని అనిపించినప్పటికీ, మరి కొంతమంది మాత్రం స్క్రీన్ పైన అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు కదా అంటూ వాపోతుంటారు. ఏది ఏమైనప్పటికీ ఆయన అనుకున్నది స్క్రీన్ పైన చూపించాలి అనుకొని అంతే రియాలిటీ గా చూపిస్తాడు దాన్ని కొందరు బోల్డ్ అన్న మరికొందరు వేరేలా అనుకున్న ఆయన మాత్రం అలానే చూపిస్తూ సక్సెస్ లు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు…