Viral Video: మెట్రో, లోకల్ ట్రైన్లలో రీల్స్ చేయడం ఇటీవల కామన్ అయింది. మెట్రో రైళ్లలో డ్యాన్స్, రీల్స్‌ను అధికారులు నిషేధించారు. అయినా యువతీ, యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు డ్యాన్సులు, రీల్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది అయితే రొమాన్స్ కూడా చేస్తున్నారు. తాజాగా ట్రైన్‌లో ఓ యువతి రీల్స్ చేసింది. కెమెరా వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తోంది.. అలా డ్యాన్స్ చేస్తూ ఆమె వెనకాలే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ని ఢీకొట్టింది. కంగారు పడి కాసేపు ఆగిపోయింది. నవ్వుతూ వెనక్కు వెళ్లింది. కానీ ఆ తర్వాత సీన్ నెటిజన్లతోపాటు లోకల్ ట్రైన్ ప్రయాణికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ముంబై లోకల్ ట్రైన్‌లో..
ఇది ఇంటర్నెట్ యుగం.. ప్రతి ఒక్కరూ ఇక్కడ తమలోని టాలెంట్‌తో ఫేమస్ అవ్వాలని, పైకి రావడానికి ప్రయత్నిస్తారు. అందుకే నేటి తరం యువతి యువకులు ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. రీల్స్, షార్ట్‌ల పేరుతో ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. కొంత కాలం క్రితం ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చాలానే కనించాయి. ఇది కేవలం మెట్రోకే పరిమితం కాకుండా ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్‌లోకి కూడా రీల్స్ మొదలు పెట్టారు. ముంబయి లోకల్ రైలులో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. అంతలోనే తన వెనుకే నిలబడి ఉన్న ఓ పోలీసును గమనించింది. ఆ వెంటనే ఆమె తన డ్యాన్స్ కాసేపు ఆపేసింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
మందలించి.. ఆమెతోనే డాన్స్..
ఈ వీడియోలో మొదట కానిస్టేబుల్ ఆ యువతిని మందలించాడు. దీంతో భయపడి డోర్ వద్దకు జరిగింది. అయితే అటు పడిపోతావ్ అని మరోసారి హెచ్చరించాడు. దీంతో ఆమె కాస్త లోపలికి వచ్చింది. కానీ ఇదే వీడియోలో తర్వాత యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ సదరు యువతితో స్టెప్పులేయడం కనిపించింది. ఈ వీడియో చూసిన ప్రయాణికులు, ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఉద్యోగి అయి ఉండి ఇలాంటి పని చేయటం ఏంటని మండిపడుతున్నారు.
వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు..
వైరల్ అవుతున్న ఈ వీడియోని ముంబై స్థానిక వ్యక్తి ఒకరు @Vivekspeaksతన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోని లక్షలాది మంది చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లోకల్ ట్రైన్‌లు, మెట్రోలలో రీల్స్ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఖాకీలే వారిని ఎంకరేజ్ చేస్తుండటం ఏంటని నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు కానిస్టేబుల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Everyone Vibing 🗿 pic.twitter.com/fppiwirZtf
— विवेक (@Vivekspeaks_) December 8, 2023