Anil Sunkara: ఈ సంక్రాంతి పోటీ లో అన్ని సినిమాలకంటే చివర్లో వచ్చిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘శతమానం భవతి’ తర్వాత సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్, వరుసగా డిజాస్టర్స్ ని అందుకుంటూ కెరీర్ లో గడ్డు పరిస్థితి ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఒకానొక సమయం లో మార్కెట్ మొత్తం పూర్తిగా కోల్పోయాడు. అలాంటి సమయం లో ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ శర్వానంద్ కెరీర్ కి మంచి బూస్ట్ ని కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర కూడా తీవ్రమైన ఆర్ధిక నష్టాల్లో ఉన్నాడు. ఆయన గత చిత్రం ‘అఖండ 2’ విడుదల అవ్వడానికే ఎన్ని ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందో మన కళ్లారా చూసాము.
విడుదల తర్వాత కూడా ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. తీవ్రమైన అప్పులో కూరుకుపోయి ఉన్నాడు అనిల్ సుంకర. ‘అఖండ 2’ కి ముందు చేసిన ‘సమజవరగమనా’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ముందు కూడా ఆయన ‘భోళా శంకర్’, ‘ఏజెంట్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్నాడు. ఇలా ఆయన కెరీర్ పెద్ద హీరోలతో చేసినప్పుడు ఫ్లాపులను అందుకోవడం, చిన్న హీరోలతో చేసినప్పుడు సూపర్ హిట్స్ ని అందుకోవడం అన్నట్టుగా సాగిపోతూ ఉంది. అయితే రీసెంట్ గా ‘నారీ నారీ నడుమ మురారి ‘ సక్సెస్ మీట్ లో అనిల్ సుంకర మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నేను భోళా శంకర్ , ఏజెంట్ లాంటి చిత్రాలు చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు, నా స్నేహితులు ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నావు అని తిట్టేవారు. ఆ సినిమా ఫ్లాప్స్ గా నిల్చిన బాధకంటే ఎక్కువగా, వీళ్ళు చేసిన ఈ కామెంట్స్ నన్ను బాధించేవి. ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన తర్వాత మా అమ్మకు టికెట్స్ బుక్ చేసి, మంచి సినిమాని తీసాను, చూసి కడుపుబ్బా నవ్వుకోండి అని గర్వంగా చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ సుంకర. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
“After #BholaaShankar and #Agent, many of my relatives and family friends, whenever they met my mom, used to ask her why I was making such bad films and even told her to ask me to stop producing movies. That hurt us far more than the films failures
After #NariNariNadumaMurari… pic.twitter.com/MWseUJZ9N2
— Vedi..VediGa… (@vedivediga) January 20, 2026