Naveen Polishetty: యంగ్ హీరోలలో డైరెక్టర్ ని చూడకుండా, కేవలం హీరో పేరు ని చూసి జనాలు టికెట్స్ కొని థియేటర్ కి వెళ్లే రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) మాత్రమే. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నవీన్ పోలిశెటీ బ్రాండ్ కి ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అని పెద్దలు చెప్పే మాటలను నవీన్ పోలిశెట్టి చాలా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. తన టాలెంట్ తో సినిమా హిట్ చేసే రేంజ్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన డిమాండ్ చేయడం లో తప్పు లేదు.
కానీ నిర్మాతలకు ఆయన పెడుతున్న కొన్ని షరతులు ఇబ్బంది కరంగా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక మీదట తనతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వాలట. అంతే కాకుండా, సినిమా మొత్తం తన దర్శకత్వ పర్యవేక్షణ లోనే జరగాలట. నవీన్ పోలిశెట్టి కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ కి, బ్రాండ్ వేల్యూ కి ఆయన 20 కోట్లు డిమాండ్ చేయడం లో తప్పు లేదు , నిర్మాత కూడా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాడు. కానీ సినిమా కథలో వేలు పెట్టి, దర్శకత్వం లో కూడా జోక్యం చేసుకుంటాను అంటేనే ఏ నిర్మాతకు అయినా కష్టం గా ఉంటుంది. జాతి రత్నాలు చిత్రానికి స్టోరీ ని నవీన్ పోలిశెట్టి నే అందించాడు. డైలాగ్స్ కూడా ఆయన స్టైల్ లో రాయించుకున్నాడు. అవి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది, ఎంజాయ్ చేశారు.
కానీ జనాలకు ఒకే టెంప్లేట్ మీద వెళ్తే, ఎదో ఒక సమయం లో బోర్ కొడుతుంది. అప్పుడు డిజాస్టర్ ఫ్లాప్ ని ఎదురుకోవాల్సి వస్తుంది. ఇలా గతం లో చాలా మంది హీరోలకు కూడా జరిగింది. వాస్తవానికి నవీన్ పోలిశెట్టి ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు, ఆయన చాలా సేఫ్ గా జాతి రత్నాలు మోడ్ లోనే సినిమాలు చేస్తూ హిట్స్ ని అందుకుంటున్నాడు. కానీ కెరీర్ లో పెద్ద రేంజ్ కి వెళ్లాలంటే డిఫరెంట్ జానర్ సినిమాలు చెయ్యాలి. అలాంటప్పుడు డైరెక్టర్ కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే వేరే లెవెల్ కి చేరుకోగలరు, ఇలా డైరెక్టర్ చేసే పనిలో చేతులు పెడితే ఎదో ఒకరోజు అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి వస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.