Amar Deep: సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary) ని అంత తేలికగా ఎవ్వరైనా మర్చిపోగలరా?. ఆ రియాలిటీ షో ద్వారా అమర్ దీప్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లో ఒక్క శాతం మాస్క్ ని కూడా ఉపయోగించకుండా, కెమెరాలు ఉన్నాయి అనే విషయాన్నే మర్చిపోయి, తానూ ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉంటూ టైటిల్ గెలవకపోయినా, నిజమైన విన్నర్ లాగా నిలిచాడు అమర్ దీప్. ఈ షో తర్వాత ఆయన రెండు మూడు సినిమాల్లో హీరో గా నటించాడు , అందులో ‘సుమతి శతకం’ అనే చిత్రం ఫిబ్రవరి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరోపక్క వరుసగా టీవీ షోస్ లో కూడా కనిపిస్తున్నాడు అమర్ దీప్. రీసెంట్ గానే ఆయన ‘BB జోడి 2′(BB Jodi 2) లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. మూడు వారాల నుండి ఈ సీజన్ నడుస్తోంది. ఈ మూడు వారాలు కూడా అమర్ దీప్ తన జోడి నైనికా తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తూ టాప్ మార్కులను సొంతం చేసుకొని గోల్డెన్ సోఫా లో కూర్చున్నారు. వీళ్ళ డ్యాన్స్ ని కొట్టే మరో జంట ఈ సీజన్ లో లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అయితే వచ్చే వారం కూడా అమర్ దీప్, నైనికా జోడి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చి టాప్ మార్కులను అందుకున్నారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యింది.
ఈ ప్రోమోలో అమర్ దీప్, నైనికా పెర్ఫార్మన్స్ ని జడ్జీలు పొగడ్తలతో ముంచి ఎత్తారు. జడ్జీ శ్రీదేవి అయితే గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చింది, శేఖర్ మాస్టర్ అయితే పైకి లేచి మరీ వీళ్ళ డ్యాన్స్ కి సెల్యూట్ చేశారు. ఇక మూడవ జడ్జి సదా అయితే నేరుగా స్టేజి మీదకు వచ్చి, ఇలాంటి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లైవ్ గా చూసే అవకాశం కల్పించినందుకు స్టార్ మా ఛానల్ కి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత అమర్ డీప్ స్టేజి పై కుప్పకూలిపోయాడు. ఎందుకంటే అతని చెయ్యి విరిగి చాలా రోజులైంది. చేతికి కట్టు కట్టుకొనే ఆయన డ్యాన్స్ వేస్తున్నాడు. ఈసారి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఆయన హెవీ కాస్ట్యూమ్స్ వేయడం తో నొప్పి బాగా పెరిగిపోయింది. అందుకే పడిపోవాల్సి వచ్చింది. ఈ ప్రోమో వీడియో ని మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడొచ్చు.
