Anil Ravipudi Wife: వరుసగా రెండు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారిపోయాడు. రాజమౌళి సినిమా అంటే పీక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఆడియన్స్ బ్లైండ్ గా ఎలా నమ్మేస్తారో, అనిల్ రావిపూడి సినిమాలను కూడా అలా నమ్మే పరిస్థితి ఏర్పడింది. పాన్ ఇండియా మూవీస్ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో, అనిల్ రావిపూడి కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ఈయన సీనియర్ హీరోల పాలిట దేవుడిలాగా తయారయ్యాడు. విక్టరీ వెంకటేష్ కి 300 కోట్ల గ్రాసర్ ని అందించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కి ఏకంగా 350 కోట్ల రూపాయిల గ్రాసర్ ని అందించాడు. ఇప్పుడు మరోసారి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడని టాక్, ఈసారి ఎన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అవుతాయో చూడాలి.
ఇకపోతే ఆయన రీసెంట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , తన కుటుంబం తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు అనిల్ రావిపూడి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో అనిల్ రావిపూడి అమ్మ, నాన్న, భార్య, కూతురు, కొడుకులను చూడొచ్చు. కూతురు, కొడుకు వయస్సులో చాలా చిన్నవారు. ఇక భార్య అయితే చక్కగా హోమ్లీ హీరోయిన్ లాగా ఉంది. ఈమె అందం ముందు నేటి తరం యంగ్ హీరోయిన్స్ కూడా పనికిరారు అనడంలో అతిశయోక్తి లేదేమో. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇకపోతే అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విశేషాలకు వస్తే, ఆయన విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది దాదాపుగా ఖరారు అయ్యింది. రీసెంట్ గానే ఒక లైన్ ని వినిపించాడట. అది వెంకటేష్ కి బాగా నచ్చేసింది. పూర్తి స్క్రిప్ట్ వర్క్ రెడీ అయ్యాక, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. అయితే ఇది కేవలం వెంకటేష్ సినిమా కాదు, ఇదొక పూర్తి స్థాయి మల్టీ స్టార్రర్ చిత్రం అని తెలుస్తుంది. మరో హీరో రోల్ కోసం తమిళ హీరో కార్తీ ని సంప్రదిస్తున్నారట. ఆయన ఒకవేళ ఒప్పుకోకపోతే మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్ ని కూడా సంప్రదిస్తారట. వీళ్లిద్దరు కుదరకపోతే వెంకటేష్, రానా కలిసి ఈ సినిమా చేయొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
