Anil Ravipudi : స్టార్ డైరెక్టర్ రాజమౌళికి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అపజయం ఎరుగని డైరెక్టర్ గా ఆయనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమాతో భారీ విజయాలను సొంత చేసుకోవడం మాత్రమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులను సెట్ చేస్తుంటారు. సీరియల్స్ నుంచి సినిమాల వరకు దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ దర్శకధీరుడిగా తన సత్తాను చాటారు. ఇక సినిమా సినిమాకు రాజమౌళి రేంజ్ పెరుగుతూనే ఉంది. ఈ డైరెక్టర్ కెరీర్ ప్లాన్స్ కూడా అద్భుతంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.
అయితే మారో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రాజమౌళి దారిలో నడుస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా అనిల్ రావిపూడి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ఎవరితో చేస్తానో తెలియదు. కానీ నాకు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంది. అంటూ ఆయన కామెంట్లు చేశారు. మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఒక మైథలాజికల్ సినిమా చేయాలనుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
మహా భారతం నుంచి ఏదో ఒక పాయింట్ పట్టుకుని సినిమా చేయాలనుందని అయితే ఎప్పుడు, ఎవరితో చేస్తానో తెలియదని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పేర్కొన్నారు. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి కూడా మహా భారతంలోని ఒక బ్లాక్ ను తెరకెక్కించాలని ఆలోచిస్తుండడం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సంక్రాంతికి వస్తున్నాంతో టాలీవుడ్ చరిత్రలో రికార్డు వసూళ్లను సాధించారు. దీంతో సీనియర్ హీరోలంతా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ రూ.20 కోట్ల రేంజ్ లో ఉంది. అనిల్ రావిపూడి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ రోజురోజుకు పెరిగి పోతుంది. ఇక మీదట అనిల్ రావిపూడి ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.