Anil Ravipudi: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలో హిట్స్ అందుకుంటున్న సమయంలో దర్శకులు మరియు స్టార్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కామెడీ ని బేస్ చేసుకుని తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువగా ఉన్నారు. చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు అంటూ రొమాంటిక్ సన్నివేశాలను, బ్లాక్ థీమ్ అంటూ భారీ భారీ బడ్జెట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రేక్షకులు చూసి కడుపుబ్బ నవ్వుకోవడానికి ఒక సినిమా కూడా పూర్తిగా కామెడీ పరంగా రావడం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు తీసే డైరెక్టర్లు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లు అనిల్ రావిపూడి, మారుతి. ఈ ఇద్దరు దర్శకుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.వీరిద్దరూ కూడా కామెడీని బేస్ చేసుకొని సినిమాలు చేసి ప్రేక్షకులను నవ్విస్తారు. అయితే మారుతి దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువగా వల్గర్ సన్నివేశాలు ఉంటాయి. ఈ ఒక్క కారణంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అలాంటి సీన్స్ చూడలేరు. ఈ కారణం చేత మారుతి దర్శకత్వం వహించిన సినిమాలను జనాలు దూరం పెడుతూ వస్తారు. ఇక అనిల్ రావిపూడి సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కానీ ఆ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా, ఫన్నీగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి నవ్వుకునే విధంగా ఉంటాయి. ఆ కారణం చేతనే అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు అని జనాలు అంటున్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని బోల్డ్ గా చూపిస్తాడు అని, అదే దర్శకుడు అనిల్ రావిపూడి ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని హెల్తీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపిస్తారు అని, ఆ కారణం చేతనే మారుతీ కొంచెం వెనక పడ్డారు. ఇక అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు అని ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ విధంగా సినిమాలు అనిల్ రావిపూడి పాన్ ఇండియా స్టార్స్ కి మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు అని జనాలు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా సంక్రాంతి బరిలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది అని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉంటె దర్శకుడు మారుతి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అని ఇప్పటికే కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.