Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వరుసగా సక్సెస్ లను సాధించిన దర్శకులు ఏది చెబితే ప్రొడ్యూసర్స్ అది వింటారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను సాధించిన వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే అనిల్ రావిపూడి రెండోవ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన అనిల్ రావిపూడి ప్రస్తుతం తన పదోవ సినిమాని వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను పెట్టి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.
ఆయన ఒక లెక్చరర్ గా నటిస్తూనే అందులో కామెడీని పంచుతూ ప్రేక్షకులకు ఎనలేని ఎంటర్టైన్మెంట్ ని అందించబోతున్నాడట. ఇక తనలోని మాస్ యాంగిల్ ను కూడా ఈ సినిమాలో బయటికి తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాతో వెంకటేష్ కి మరో సక్సెస్ ని కట్టబెడతాడనే ఉద్దేశ్యంతో వెంకటేష్ అభిమానులైతే ఉన్నారు.
వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాతో వీళ్ళ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఏకంగా వెంకటేష్ 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే తొందరలోనే అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమా షూటింగ్లో కూడా భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…
ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఆయన లాంటి దర్శకుడు మరొకరు ఉండరు. ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకొని సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒక అతనికి మాత్రమే చెల్లింది. ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమాని తెరకెక్కించడంలో ఆయన ప్రతిసారి సక్సెస్ అవుతూనే ఉన్నాడు…