Small Heroes Demand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల హవా కొనసాగుతుంది. చిన్న బడ్జెట్ తో సినిమాలను చేసి భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్న చిన్న హీరోల హవా పెరిగి పెను సంచలనాలను క్రియేట్ చేయడం విశేషం. ఇక స్టార్ ప్రొడ్యూసర్లందరు చిన్న హీరోల వైపే తమ ఆసక్తిని చూపిస్తున్నారు. వాళ్లతో సినిమాలను చేసి భారీ లాభాలను గడించొచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తిరువీర్, అఖిల్ రాజ్, మౌళి లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్లకు మంచి మార్కెట్ అయితే ఉంది. తక్కువ బడ్జెట్ పెట్టి వీళ్ళ మీద ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకు ఉన్న క్రేజ్ ని వాడుకోవాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు.
దానికి వాళ్లు కూడా సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ నుంచి మరింత బెస్ట్ కంటెంట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… నిజానికి ఒక సినిమాలో హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే కంటెంట్ అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సాధించలేని ఘనతను కుర్ర హీరోలు సాధిస్తున్నారు… కంటెంట్ అనేది కింగ్ కాబట్టి అది బాగుంటే ఎవరైనా సరే సినిమాని చూస్తారు. కాబట్టి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను ఎంచుకొని మన హీరోలు ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
మన ప్రొడ్యూసర్లు స్టార్ హీరోల సినిమాల మీద వేల కోట్ల బడ్జెట్ ను పెట్టి వందల కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన కూడా వాళ్లకు మిగిలేదేమీ లేదు. అలా కాకుండా చిన్న హీరోల మీద ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేసి 20 కోట్ల కలెక్షన్స్ వచ్చిన కూడా వాళ్లకు దాదాపు 15 కోట్ల వరకు లాభం అయితే వస్తుంది. కాబట్టి చిన్న సినిమాలు రిస్క్ లేకుండా చేసుకోవడం బెటర్ అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది…