Venkatesh Kalyan Ram New Movie: అనిల్ రావిపూడి సినిమాలకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ప్రేక్షకులకు కామెడీ ఎంటర్ టైనర్స్ ను అందించి సూపర్ సక్సెస్ లను సాధించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒకప్పుడు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ ఎలాంటి సినిమాలైతే చేసేవారో ఇప్పుడు ఆయన అలాంటి ఫార్మాట్లోనే ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఆ జానర్ లో అలాంటి టైప్ ఆఫ్ సినిమాలు చేసే దర్శకుడు ఎవరు లేకపోవడం వల్ల అనిల్ రావిపూడి సినిమాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తున్నాయి. తద్వారా ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో వచ్చి సంక్రాంతి హిట్ సాధిస్తున్నాడు. ఇక ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను కలిపి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాని సైతం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి క్యారెక్టర్లు ఏంటి అనేది ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read: అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కథలు కాపీనేనా..?
ప్రస్తుతం ఈ సినిమాలో వెంకటేష్ ఒక ఫ్యాక్షనిస్టుగా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బావ బామ్మర్ది గా చేస్తున్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం ఏంటి కళ్యాణ్ రామ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా తన జీవితాన్ని తన కొనసాగిస్తూ ఉంటే ఫ్యాక్షనిస్ట్ గా ఉన్న వెంకటేష్ దగ్గరికి కళ్యాణ్ రామ్ ఎందుకు రావాల్సి వచ్చింది.
వీళ్లిద్దరి మధ్య కలిగిన క్లాసెష్ ఏంటి? ఇద్దరూ ఒకరి ప్రాబ్లంని ఒకరు ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికి దీని ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుందట. అలాగే ఇంతకుముందు అనిల్ రావిపూడి సినిమాలన్నింటిలో చేసినట్టుగా ఈ మూవీలో కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుందని అనిల్ రావిపూడి చెబుతుండడం విశేషం…
ఇక ఈ సినిమాతో 2027 సంక్రాంతికి సక్సెస్ ని సాధిస్తే వరుసగా మూడు సంక్రాంతులకు సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడవుతాడు. నిజానికి ఇప్పటి వరకు వరుసగా మూడు సంక్రాంతులకు సక్సెస్ లను సాధించిన దర్శకులెవరు లేరు. కాబట్టి ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు దర్శకుడిగా ఒక కొత్త రికార్డు ను క్రియేట్ చేసినవాడవుతాడు…