Anil Ravipudi
Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)… ఆయన చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూనే తనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. తద్వారా ఆయన వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన సినిమాలో చాలామంది కమెడియన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కామెడీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఒకప్పటి జంధ్యాల కామెడీని గుర్తు చేస్తూ ఆయన సినిమాలో పండించే కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇలాంటి కామెడీ దర్శకుడు ఎందుకని బ్రహ్మానందం(Bramhanandam) లాంటి టాప్ కమెడియన్ ను ఒక్క సినిమాలో కూడా తీసుకోలేదనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఆయన ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేశాడు. మరి ఆ ఎనిమిది సినిమాల్లో ఒక్క సినిమాలో కూడా బ్రహ్మానందం నటించే పాత్ర అయితే లేదా మరి కావాలనే ఆయన బ్రహ్మానందం ను తీసుకోవట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని అడిగితే బ్రహ్మానందం గారు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్ర ఏదైనా తగిలినప్పుడు ఆయనతో తప్పకుండా చేస్తా… ఇప్పటివరకు ఆయన అన్ని పాత్రలను పోషించాడని ఆయన కోసం ఏ పాత్ర రాసిన కూడా అది రోటీన్ అవుతుందని అన్నారు. నేను బ్రహ్మానందం గారిని నా సినిమాలో రెగ్యూలర్ పాత్రలో చూడలేను అని అనిల్ రావిపూడి ఇంతకు ముందు కలరిటీ అయితే ఇచ్చాడు.
నిజానికి దర్శకుడు అతన్ని పెట్టాలి అనుకున్నప్పుడు ఏదో ఒక కొత్త పాత్రను అయితే రాయొచ్చు.మరి అనిల్ మాత్రం బ్రహ్మానందంతో ఎక్స్పరిమెంటల్ క్యారెక్టర్లు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే అతన్ని తీసుకునే ఉద్దేశ్యం అనిల్ కి లేదు.
అందువల్లే అలాంటి క్యారెక్టర్స్ ను డిజైన్ చేయలేకపోతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…మరి ఫ్యూచర్ లో అయిన అనిల్ రావిపూడి బ్రహ్మానందం ను తీసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…