Anil Ravipudi-Chiranjeevi
Anil Ravipudi : ఎంత పెద్ద హీరో అయినా.. ఆరు నెలల్లో సినిమా ముగించగల ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విషయంలో పూరి జగన్నాధ్ ని కూడా మించిపోయాడు. వేగంగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకోవడం అనిల్ రావిపూడిలో ఉన్న మరో ప్రత్యేకత. నెలల వ్యవధిలో విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. వంద కోట్ల వసూళ్లే వెంకీకి కష్టం అనుకుంటే.. ఏకంగా రూ. 300 కోట్ల మార్క్ దాటి చూపించాడు.
గతంలో ఎఫ్ 2 రూపంలో వెంకీకి భారీ హిట్ ఇచ్చిన.. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సోలోగా అతిపెద్ద విజయం కట్టబెట్టాడు. చరణ్, బాలయ్యలను వెనక్కి నెట్టిన వెంకీ.. సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో జోరుమీడుతున్న అనిల్ రావిపూడికి చిరంజీవి పిలిచిమరీ ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వంభర పూర్తి చేస్తున్న చిరంజీవి.. త్వరలో అనిల్ రావిపూడి మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
2026 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల చేయాలి అనేది ప్లాన్. అందుకు అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికలు వేస్తున్నాడు. శరవేగంగా మూవీ పూర్తి చేసి సంక్రాంతికి రావాలని చూస్తున్నాడు. అందులో భాగంగా నాలుగు సాంగ్స్ ఫైనల్ చేశాడట. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకు కలిసొచ్చింది. చిరంజీవి చిత్రానికి కూడా భీమ్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడట.
భీమ్స్ నాలుగు పాటలు పూర్తి చేశాడట. అనిల్ రావిపూడి భీమ్స్ ఇచ్చిన నాలుగు పాటలను ఓకే చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ సినిమా వేడుకలో… అనిల్ రావిపూడి-చిరంజీవి చిత్రానికి ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ పెడితే బాగుంటుంది.. అని అన్నారు. మాస్ వైబ్రేషన్స్ తో కూడిన ఆ టైటిల్ ని అనిల్ రావిపూడి పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మాస్, కమర్షియల్ హంగులతో చిరంజీవి మూవీ ఉంటుందని సమాచారం. ఇక విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.