Anil Ravipudi: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ బాలయ్య సినిమా పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.

ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నాము. ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తాము. వచ్చే ఏడాది జూలై నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.
Also Read: ‘అఖండ’ తర్వాత సినిమా కోసం అమెరికాకు బాలయ్య.. షూటింగ్ అంతా అక్కడేనట!
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిజానికి అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నాడు. కాకపోతే, మహేష్, రాజమౌళితో సినిమా కోసం కొత్త సినిమాలు అంగీకరించే పరిస్థితిలో లేడు. మరోపక్క సితార ఎంటర్ టైన్మెంట్స్ కి అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలి.
సితార నాగవంశీ బాలయ్య అభిమాని. పైగా నందమూరి కుటుంబానికి నాగవంశీ అత్యంత సన్నిహితుడు. నిర్మాతగా బాలయ్యతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. అందుకే ఎలాగైనా అనిల్ – బాలయ్య కలయికలో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేసి మొత్తానికి కాంబినేషన్ ను సెట్ చేశాడు.
Also Read: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఎఫ్3.. క్లారిటీ ఇచ్చిన వెంకి
ఎలాగూ బోయపాటి ‘అఖండ’ సినిమా రోజురోజుకు అంచనాలను పెంచుతూ పోతుంది. అందుకే అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అలా వీరి కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయింది.