Anil Ravipudi And Nagarjuna: ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తో కొనసాగుతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే, అది అనిల్ రావిపూడి మాత్రమే. కమర్షియల్ సినిమాలు ఇతర డైరెక్టర్స్ తీస్తే చూసే మూడ్ లో ఆడియన్స్ లేరు , కానీ అనిల్ రావిపూడి తీస్తే మాత్రం బ్రహ్మరథం పట్టడానికి రెడీ గా ఉంటారు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రస్తుతం కమర్షియల్ జానర్ లో అన్నీ పర్ఫెక్ట్ మీటర్ లో సినిమాలు తీస్తున్నది. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ నిరాశ చెంది మాత్రం బయటకు వెళ్ళడు , మినిమం గ్యారంటీ ఎంటెర్టైమెంట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంటుంది కాబట్టే , అనిల్ రావిపూడి సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుంది. అయితే సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జున తో మినహా, మిగిలిన ముగ్గురుతో సినిమాలు తీసి అనిల్ రావిపూడి వాళ్లకి మెమరబుల్ సూపర్ హిట్స్ ని అందించాడు.
వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీయగా , మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ హిట్ , బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు. ప్రస్తుతం వెంకటేష్ తో నాల్గవ సినిమా చేస్తున్నాడు. అయితే సీనియర్ హీరోలందరితో సినిమాలు చేశావ్ , అక్కినేని నాగార్జున తో సినిమా ఎప్పుడు అని అనిల్ రావిపూడి ని ప్రతీ ఇంటర్వ్యూ లో , ఈవెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు . కచ్చితంగా నాగార్జున గారితో సినిమా చేస్తాను అని క్లారిటీ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి , ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ ఒక సినిమాని ఫైనల్ చేశాడట ఒక టాప్ నిర్మాత. అది కచ్చితంగా దిల్ రాజు అయ్యుంటాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది కానీ , పూర్తి వివరాలు బయటకు రాలేదు.
వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చిత్రం పూర్తి అవ్వగానే, అక్కినేని నాగార్జున తో సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తాడట అనిల్. నాగార్జున కెరీర్ లో ‘హలో బ్రదర్’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. కేవలం ఆయన కెరీర్ లోనే కాదు , కమర్షియల్ సినిమా ఫార్మాట్లో కొత్త ఒరవడి ని సృష్టించింది ఆ చిత్రం. నాగార్జున తో ఇప్పుడు అదే తరహా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. పర్ఫెక్ట్ గా తీస్తే , ఈ సినిమాతో నాగార్జున కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అవలీలగా ఈయన కూడా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోక్ చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
