Anil Ravipudi meets Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన 12 సినిమాలు చేయగా అందులో 12 సూపర్ హిట్లు గా నిలిచాయి. ఇక రాజమౌళి తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నాడు. ఆయన 9 సినిమాలు చేస్తే అందులో 9 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. దాంతో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేటు ఉన్న దర్శకులలో అనిల్ రావిపూడి రెండోవ స్థానాన్ని దక్కించుకున్నాడు… ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తాయి. సంక్రాంతి పండక్కి తన సినిమా చూసి ప్రేక్షకులు రిలాక్స్డ్ గా పండగ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో కూడా ఈ సంక్రాంతికి చిరంజీవిని హీరోగా పెట్టి ఆయన చేసిన మన శంకర్ వరప్రసాద్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమాతో అనిల్ రావిపూడి పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది…ఇక ప్రస్తుతం ఆయన నాగార్జునతో సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లతో సినిమాలను చేసిన ఆయన నాగార్జునతో సినిమా చేసి అతనికి సక్సెస్ ని అందించాలని చూస్తున్నాడు.
అలా చేస్తే ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరికి సక్సెస్ ని అందించిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడు…ఇక ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు…ఇక అనిల్ రావిపూడి రీసెంట్ గా నాగార్జునను కలిసినట్టుగా తెలుస్తుంది. అతనికి ఒక లైన్ అయితే వినిపించారట. అది నాగార్జునకి బాగా నచ్చిందట.
ప్రస్తుతం ఈ మూవీ ఉండకపోయిన కూడా వచ్చే సంవత్సరం ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఈలోగా నాగార్జున కమిట్ అయిన సినిమాలు చేస్తాడట. అలాగే అనిల్ మరి హీరోతో ఇంకో సినిమా చేస్తాడట. మొత్తానికైతే వచ్చే సంవత్సరంలో నాగార్జున అనిల్ రావిపూడి సినిమా పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను సాధించడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో ఆయన ప్రతి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు…