Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక సీనియర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని ఆకట్టుకునే విధంగా మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఈయన చేస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది అంటూ ఆయన కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. అలాగే ఈ సినిమా దర్శకుడు అయిన అనిల్ రావిపూడి సైతం విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు. ఇక వెంకటేష్ లాంటి హీరోతో కూడా ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. లైఫ్ లో ఇప్పటివరకు వెంకటేష్ ఎప్పుడు ఒకసారి కూడా రీల్స్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అటు భార్య ఇటు మాజీ లవర్ మధ్యలో నలిగిపోయే పాత్ర లో వెంకటేష్ ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నాడు అనే విషయాన్ని రీల్స్ రూపంలో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి విషయాన్ని ప్రమోషన్స్ ద్వారానే తెలియజేస్తున్నారు. ఉదాహరణకి సాంగ్ రిలీజ్ చేసిన ప్రమోషన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసిన ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నారు. ఇక ఇది ఏమైనా కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక ఈ విషయంలో అనిల్ రావిపూడి రాజమౌళి ని అనుసరిస్తున్నాడని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా సినిమా అల్టిమేట్ గా సూపర్ సక్సెస్ అయితేనే దర్శకుడికి మంచి గుర్తింపైతే లభిస్తుంది. దానివల్ల ఆయన ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే అటు వెంకటేష్ కెరీర్ అనేది మరోసారి గాడిలో పడుతుంది. ఇంతకు ముందు గత సంక్రాంతికి వెంకటేష్ చేసిన సైందవ్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
కాబట్టి ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక తర్వాత చిరంజీవి ని డైరెక్షన్ చేయబోతున్నాడు కాబట్టి ఆ సినిమాకి ముందు ఒక సక్సెస్ ని సాధించి తనతో సినిమా చేయడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి గతం లో చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడం విశేషం…