Aditya Om : ‘బిగ్ బాస్’ సీజన్ 8 లో హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఎలిమినేట్ అయ్యే వరకు ఒక్క రిమార్క్ కూడా లేకుండా బయటకి వెళ్లిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆదిత్య ఓం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన తోటి కంటెస్టెంట్స్ తో ఈయన నడుచుకున్న విధానం, ప్రవర్తన, ఎంతటి హీట్ వాతావరణం లో అయినా మాట తూలకుండా వ్యవహరించి ఇంత మంచి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు రా బాబు అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆదిత్య ఓం మన తెలుగు ప్రేక్షకులు ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మన ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసాడు కానీ అవి అంతగా ఆకట్టుకోల్కేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం ఆయనకీ మంచి బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి.
చూసేందుకు తెలుగు అబ్బాయి లాగానే అనిపించే ఆదిత్య ఓం, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడు కాదు. మహారాష్ట్ర కి చెందిన వాడు. ఇతని తండ్రి ఒక IAD ఆఫీసర్. తల్లి ఒక పొలిటీషియన్. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం బ్యూరో కట్స్ , జడ్జిలే. ఇలా ఇంట్లో అందరూ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడగా, ఆదిత్య ఓం మాత్రం సినిమాలనే నమ్ముకున్నాడు. ఇది ఇలా ఉండగా ఆదిత్య కి మంచి సోషల్ సర్వీసులు చేసే అలవాటు ఉంది. ‘ఎడ్యూలైట్మెంట్’ అనే సంస్థ ని ఏర్పాటు చేసి ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసాడు. రీసెంట్ గా ఆయన చెరుపల్లి అనే గ్రామానికి త్రాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేసాడు. ఆయన చేసిన ఈ గొప్ప కర్యంపై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
పూర్తి వివరాల్లోకి చెరుపల్లి అనే గ్రామం లోని ప్రజలు ఎన్నో ఏళ్ళ నుండి కలుషిత నీళ్లను త్రాగుతున్నారు. దాని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు గ్రామా ప్రజలకు ఎదురయ్యాయి. ఇదంతా తన టీం ద్వారా తెలుసుకున్న ఆదిత్య ఓం, ఎలా అయినా ఈ సమస్యలను తీర్చాలని కంకణం కట్టుకున్నాడు. ఒక ఆర్వో ప్లాంట్ ని ఏర్పాటు చేసి, స్వచ్ఛమైన త్రాగు నీరు అందించేందుకు కృషి చేసాడు. ఈ సంక్రాంతికి ఈ ఆర్వో ప్లాంట్ సిద్ధం కాబోతుంది. కేవలం ఇదొక్కటే కాదు, ఆ గ్రామప్రజలు విద్య, ఉపాధి సౌకర్యాలు కలిపిస్తూ ఒక లైబ్రరీ ని స్థాపించాడు. అదే విధంగా డిజిటల్ కేంద్రాన్ని ప్రారంభించాడు, చదువుకొని ఉద్యోగాలు చేసుకునేవారికి ల్యాప్ టాప్ లు అందించాడు. అంతే కాకుండా చీకట్లో బ్రతికే ఆ ఊరి మొత్తానికి సోలార్ లైట్లు వేయించాడు. ఇలా చెరుపల్లి ని దేశంలోనే ఒక మోడల్ పల్లెటూరి గా తీర్చి దిద్దాలని ఆయన బలంగా సంకల్పించాడు.