Amaran Movie Collection : అమరన్ చిత్రంతో నిర్మాతగా కమల్ హాసన్ కి భారీ లాభాలు..3 రోజులలో ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా!

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వసూళ్లు కూడా వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలకు కలిపి 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 31 కోట్ల 70 లక్షల రూపాయిలను రాబట్టింది.

Written By: Vicky, Updated On : November 3, 2024 6:52 pm

Amaran Movie Collection

Follow us on

Amaran Movie Collection : కమల్ హాసన్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు,ఆయనలో ఒక గాయకుడు,దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో కోణాలు ఉన్నాయి. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ ద్వారా ఒక నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించాడు. కానీ అవి కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నిర్మాతగా భారీగా నష్టపోయి ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నాడు. అప్పుల పాలయ్యాడు, అలాంటి సందర్భంలో నిర్మాతగా, హీరో గా ఆయనకీ పునర్జన్మ ని ఇచ్చిన చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో కమల్ హాసన్ ఆర్ధిక కష్టాలన్నీ తీరిపోయాయి. కెరీర్ లో ఎన్నడూ చూడని లాభాలను ఈ చిత్రం ద్వారా చూసాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన శివ కార్తికేయన్ ని హీరో గా పెట్టి ‘అమరన్’ అనే చిత్రాన్ని నిర్మించాడు.

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వసూళ్లు కూడా వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలకు కలిపి 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 31 కోట్ల 70 లక్షల రూపాయిలను రాబట్టింది. ఇక మూడవ రోజు అయితే మొదటి రెండు రోజులకంటే ఎక్కువగా 37 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 67 కోట్ల రూపాయలకు జరగగా, బ్రేక్ ఈవెన్ మార్కుకి మరో 16 కోట్ల రూపాయిల షేర్ రావాల్సి ఉంటుంది. నేటితో ఆ మార్కుని దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో వివరంగా చూస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 5 కోట్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, అప్పుడే రెండు కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి అన్నమాట. అదే విధంగా 48 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటకలో 6 కోట్ల రూపాయిలు, కేరళలో 3 కోట్ల 30 లక్షల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలను రాబట్టింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ఏకంగా 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శివ కార్తికేయన్ కి ఇది వరకు వరల్డ్ వైడ్ గా కూడా ఇంత వసూళ్లు వచ్చేవి కాదు, అలాంటిది ఇప్పుడు కేవలం ఒక ప్రాంతం నుండి వస్తుందంటే ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమాకి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతగా కమల్ హాసన్ కి వందల కోట్ల రూపాయిలు లాభాలు రానున్నాయి.