Anil Geela Cried Infront of Chiranjeevi
Chiranjeevi: సోషల్ మీడియా యుగంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం ఏర్పడింది. గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు కూడా జనాల్లో విపరీతమైన పాపులారిటీ సాధించారు. దేశంలో లక్షల మంది సోషల్ మీడియా కారణంగా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇలాంటి వారి కోసం డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ పాల్గొన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ స్టార్స్ ని సన్మానించారు. ఈ సందర్భంగా అనిల్ గీలాకు చిరంజీవిని కలిసే అవకాశం దక్కింది. అనిల్ గీలాను వేదికపైకి ఆహ్వానించగా వెళ్ళాడు. అనిల్ గీలా చిరంజీవిని గట్టిగా హత్తుకున్నాడు. చిరంజీవిని కలవడంతో ఎమోషనల్ అయిన అనిల్ గీలా ఏడ్చేశాడు. చిరంజీవి గారి చొక్కా తడపవద్దని పక్కనే ఉన్న యాంకర్ సుమ కనకాల అన్నారు. ఒక మారుమూల పల్లెకు చెందిన అనిల్ గీలా చిరంజీవి అభిమాని. ఆయన్ని కలిసే అవకాశం వస్తుందని అనిల్ గీలా ఊహించి ఉండడు.
చిరంజీవిని దగ్గరగా చూసి అనిల్ గీలా సంబరంగా ఫీల్ అయ్యాడు. మై విలేజ్ షో పేరుతో అనిల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. గంగవ్వ తో ఆయన వీడియోలు చేసేవాడు. గంగవ్వ అత్యంత పాప్యులర్ అయ్యింది. ఆమె మాట తీరు, చేతలు వీడియోల్లో బంధించి యూట్యూబ్ లో పోస్ట్ చేసేవారు. గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ షోకి వెళ్లిన విషయం తెలిసిందే.
సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ సత్తా చాటింది. అయితే అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ కాకుండానే బయటకు వచ్చింది. ప్రస్తుతం నటిగా కూడా కొనసాగుతుంది. పలు చిత్రాలు, వెబ్ సిరీస్లలో గంగవ్వ నటిస్తుంది. మరోవైపు అనిల్ గీలా సైతం నటుడిగా, యూట్యూబర్ గా రాణిస్తున్నాడు. అనిల్ గీలా వీడియోలు ఆదరణ దక్కించుకుంటున్నాయి. అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు..
అనిల్
One Of The Best YouTuber కష్టపడి పైకి వచ్చాడు
కష్టపడి పని చేసే ప్రతీ ఒక్కరి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే ♥️#Chiranjeevi pic.twitter.com/bzudSNCGfB
— SANDEEP JSP (@JspSandeep_) April 1, 2024
Web Title: Anil geela cried infront of chiranjeevi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com