Andrea Jeremiah: తమిళ హాట్ బ్యూటీ నటి గాయని ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట గాయనిగా సినీ రంగం వైపు అడుగులు వేసిన ఈ చిన్నది, ఆ తర్వాత నటిగా మారి తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ మొదలైన చోట్ల తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కెరీర్ లో దూసుకెళ్తుంది.
ఆమె అసలు పేరు ఆండ్రియా జెర్మియా చెన్నై లోని అరక్కోణం లో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కం లో మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో పాటలు పాడుతుంది. ఆమెకు పియానో వాయించడం బాగా వచ్చు. పైగా ఆమె న్యాయవాదిగా కూడా పనిచేస్తుంది. 2005 లో కందా నాల్ ముదల్ అనే సినిమాలో అతిథి పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది.
యుగానికి ఒక్కడు, విశ్వరూపం లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ తఢాకా సినిమాతో నేరుగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇటీవల సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలో “ఊ అంటావా” పాటను తమిళ్ వెర్షన్ పాడి మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఈ 36 ఏళ్ల సుందరి అనేక వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది.
వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనల్ మేల్ ఫణితులి అనే సినిమాలో ఆండ్రియా అర్ద నగ్నంగా నటించిందని తెలుస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న అడగటంతో అవును నిజమే సినిమాలో ఆ సన్నివేశంలో నటిస్తున్న సమయంలో చాలా బిడియంగా అనిపించింది. కానీ నా లైఫ్ లో అంతకు మించిన సంఘటనలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. దీనితో ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా జరుగుతుందనే టాక్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆండ్రియా ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసిందని ఒక సెక్షన్ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిన్నది “నో ఎంట్రీ, బాబీ ఆంటోని, పిశాచి 2, మాళిగై ” లాంటి దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హీరో వెంకటేష్ 75 వ సినిమా గా తెరకెక్కుతున్న ‘సైంధవ్’ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.