Jailer Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపిస్తున్నాడు. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూ అనేక రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న జైలర్ మూవీ భాషలతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతుంది.
కేవలం నాలుగు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ ఐదో రోజు కూడా అదే ఫ్లో ను కొనసాగించింది. ఏ సినిమాకు అయిన మండే టెస్ట్ అనేది చాలా అవసరం. సినిమా లాంగ్ రన్ అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. ఈ మండే టెస్ట్ లో జైలర్ నెగ్గింది. ఐదో రోజు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 28 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. విడుదలైన రెండో రోజు కంటే కూడా ఐదో రోజు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం .
వరల్డ్ వైడ్ లో ఐదో రోజు వసూళ్లు కలిపితే ఈ సినిమా 350 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండియాలో తొలి ఐదు రోజుల్లో కలిపి దాదాపు 178 కోట్లు పైగా నెట్ వసూళ్లు చేసింది జైలర్ మూవీ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన జైలర్ మూవీ కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావటమే కాకుండా ఓవర్ ఫ్లో స్టార్ట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర జైలర్ దూకుడు చూస్తుంటే ఈజీగా 600 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసే అవకాశం ఉంది.
చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్ స్థాయికి తగ్గ హిట్ పడింది. దీంతో తలైవా ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. పైగా ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పెషల్ రోల్స్ లో నటించడంతో సినిమాకు అదనపు బలం చేకూరింది. దీంతో కన్నడ, మలయాళంలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక తెలుగులో భోళా శంకర్ బోల్తా పడటంతో జైలర్ కి అడ్డు లేకుండా పోయింది.