Andhra King Taluka Release Date: టైటిల్ తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రేపాడు హీరో రామ్. అయితే ఈ సినిమా విడుదల విషయంలో పెద్ద సస్పెన్సు నెలకొంది. ఆంధ్రా కింగ్ తాలూకా టీమ్ సైలెంట్ అయిన నేపథ్యంలో అసలు ఏమవుతుందనే అనుమానాలు మొదలయ్యాయి..
Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
పిఠాపురంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాక… పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఓ ట్యాగ్ వైరల్ అయ్యింది. బైక్ నెంబర్ ప్లేట్స్ మీద జన సైనికులు ఈ క్యాప్షన్ రాయించడం ట్రెండ్ గా మార్చారు. ఈ ట్యాగ్ తరహాలో రామ్ పోతినేని తన సినిమా టైటిల్ ఖరారు చేయడం ఆసక్తి రేపింది. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra King Taluka) టీజర్ తో ఆ ఆంధ్రా కింగ్ ఎవరో క్లారిటీ వచ్చింది. అనూహ్యంగా కన్నడ స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్ కాగా… ఆయన ఫ్యాన్ గా రామ్ పోతినేని ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
ఉపేంద్ర… స్టార్ హీరో సూర్య అనే పాత్రలో కనిపించనున్నారు. రామ్ పోతినేని(Ram Pothineni)కి జంటగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. కాగా ఆంధ్రా కింగ్ తాలూకా చిత్ర విడుదలపై సస్పెన్సు కొనసాగుతుంది. నిజానికి జులైలో ప్రేక్షకుల ముందుకు తేవాలి అనుకున్నారు. అయితే ఆ సూచనలు కనిపించడం లేదు. జులై 24న హరి హర వీరమల్లు విడుదల ఉంది. ఆ నెక్స్ట్ వీక్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ విడుదలకు సిద్ధం అవుతుంది. జులైలో ఆంధ్రా కింగ్ విడుదలయ్యే సూచనలు లేవు.
ఆగస్టులో వార్ 2, కూలీ వంటి బడా చిత్రాలు థియేటర్స్ లోకి రానున్నాయి. ఆగస్టులో ఆంధ్రా కింగ్ విడుదల చేసే ఆలోచన మేకర్స్ లో లేదని తెలుస్తుంది. అందుకే వారు సైలెంట్ అయ్యారు. ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహించడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రా కింగ్ తాలూకా థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడనే సందిగ్దత కొనసాగుతుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కలవు. రామ్ ఫ్యాన్స్ ఆంధ్రా కింగ్ తాలూకా విడుదలపై స్పష్టత కావాలని కోరుకుంటున్నారు.
మరోవైపు రామ్ పోతినేని హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన గత రెండు చిత్రాలు వారియర్, స్కంద బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. స్కంద చిత్రానికి బోయపాటి దర్శకుడు కావడంతో రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. స్కంద ఫలితం రామ్ కి షాక్ ఇచ్చింది. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా నే రామ్ ని కాపాడాలి. మైత్రీ మూవీ బ్యానర్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్నాడు.