Dhamaka Movie First Review: రవితేజ ఫ్యాన్స్ ధమాకా మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆయన గట్టిగా కొడతారని ఫిక్స్ అయ్యారు. క్రాక్ మూవీతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ ఆనందాన్ని ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆవిరి చేశాయి. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయిన ఈ రెండు చిత్రాలు ఫ్యాన్స్ ని సైతం ఇబ్బంది పెట్టాయి. ఈ టైం లో రవితేజకు సాలిడ్ హిట్ పడితేనే కిక్ అని జనాలు నమ్ముతున్నారు. రవితేజ ఫ్యాన్స్ హిట్ దాహం ధమాకా తీరుస్తుందని అందరూ నమ్ముతున్నారు. కారణం.. ధమాకా చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ అదిరిపోగా ఫ్యాన్స్ సక్సెస్ కొడుతున్నామని ఫిక్స్ అయ్యారు.

అయితే వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఫస్ట్ రివ్యూ ఉంది. ధమాకా మూవీ నచ్చలేదంటూ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు అయిన ఉమర్ సంధు స్టార్ హీరోల సినిమాలపై తన అభిప్రాయం తెలియజేస్తారు. సెన్సార్ సభ్యుడైన నేపథ్యంలో విడుదలకు కొన్ని రోజుల ముందే ఆయన రివ్యూలు వస్తాయి. ధమాకా చిత్రం చూశాను అంటున్న ఉమర్ సంధు.. కేవలం 2 స్టార్స్ ఇచ్చాడు. ధమాకా చిత్రానికి ఆయన రేటింగ్ 2/5.
తన షార్ట్ రివ్యూలో… రవితేజ మీరు మారాలి. సీరియస్ తో కూడిన సాలిడ్ రోల్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. బి గ్రేడ్ మసాలా రోల్స్ లో మిమ్మల్ని చూసి విసిగిపోయాము. చేసేదేం లేదు, ఈ క్రిస్మస్ కి బి గ్రేడ్ మసాలా చిత్రం చూడబోతున్నాము. రవితేజ మీ కెరీర్ ముగిసినట్లే… వరుసగా పనికిమాలిన మాస్ మసాలా చిత్రాలు చేస్తున్నారు, అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ధమాకా చిత్రంపై ఉమర్ సంధు రివ్యూ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో రవితేజ ఫ్యాన్స్ ఉమర్ సంధుపై మండిపడుతున్నారు.

ఈ మధ్య చాలా సినిమాలకు ఉమర్ సంధు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి కూడా ఇదే తరహా రివ్యూ ఇచ్చారు. ఆ మూవీ డిజాస్టర్, ఏ కోణంలో కూడా ఎంటర్టైన్ చేయలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. గతంలో ఉమర్ సంధు స్టార్ హీరోల సినిమాలకు భారీ రేటింగ్స్ ఇచ్చేవాడు. ఆయన అద్భుతం అంటూ 4 స్టార్స్ ఇచ్చిన చిత్రాలు అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఉమర్ సంధు రివ్యూ నమ్మాల్సిన పనిలేదు. ఆయన విశ్లేషణలో ప్రమాణాలు ఉండవనే అభిప్రాయం ఉంది. ఇక త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.