Game Changer and Sankranti Amanam : ప్రతీ ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు, థియేటర్స్ లో సరికొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. మనకి ఇష్టమైన అభిమాన హీరోల సినిమాలు కనీసం నాలుగైనా థియేటర్స్ లో విడుదల అవుతుంటాయి. నిర్మాతలకు కూడా సంక్రాంతి పండగ పెద్ద బూస్ట్ ని ఇచ్చే సీజన్ అనొచ్చు. ఎన్ని సినిమాలు విడుదల చేసుకున్న లాభాలు లెక్కపెట్టుకోవడమే అన్నట్టుగా కలెక్షన్స్ వస్తుంటాయి. అలా ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలతో పాటు, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు నిర్మాత దిల్ రాజు. ఒకే నిర్మాత నుండి ఇలా రెండు సినిమాలు నాలుగు రోజుల గ్యాప్ తో విడుదల అవ్వడం ఇది రెండవ సారి. గత ఏడాది ఇలాంటి ప్రయోగం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రెండు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇలా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రయోగం చేసి సక్సెస్ అవ్వడంతో, దిల్ రాజు కూడా తన రెండు చిత్రాలతో అలాంటి ప్రయోగం చేయబోతున్నాడు. ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియన్ చిత్రం, ఈ సినిమాకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, సూపర్ హిట్ టాక్ వస్తే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ చిత్రంలోని పాటల కంటే ఎక్కువ రెస్పాన్స్ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రావడం అందరినీ ఆశ్చరునికి గురి చేస్తుంది. భీమ్స్ ఇప్పటి వరకు రెండు పాటలు అందిస్తే, రెండు కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
‘గోదారి గట్టు మీద’ పాటకు ఇప్పటి వరకు 32 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ పాట మీద ఇంస్టాగ్రామ్ లో 5 లక్షలకు పైగా రీల్స్ పడ్డాయి. ‘గేమ్ చేంజర్’ సాంగ్స్ కి ఇంస్టాగ్రామ్ లో కనీసం రెండు లక్షల రీల్స్ కూడా లేకపోవడం గమనార్హం. తమన్ ‘గేమ్ చేంజర్’ కి మోత మోగిపోయే రేంజ్ చార్ట్ బస్టర్ సాంగ్ ని అందించలేకపోయాడు అనేది వాస్తవం. రెండు సినిమాలను పోల్చి చూస్తే, కచ్చితంగా ‘గేమ్ చేంజర్’ పాటలకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాటలే బాగున్నాయి. నిన్న ఈ చిత్రం నుండి విడుదలైన ‘మీనా’ సాంగ్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ధమాకా’ తర్వాత భీమ్స్ నుండి ఆ రేంజ్ చార్ట్ బస్టర్ ఆల్బం ఈ సినిమాకే దొరికిందని అంటున్నారు విశ్లేషకులు సైతం. రేపు ‘గేమ్ చేంజర్’ నుండి విడుదల అవ్వబోతున్న ‘డోప్’ పాటకి అయినా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూద్దాం.