Anchor Suma: మొన్న ఈటీవీ కి సంబంధించి “వేర్ ఈజ్ ది పార్టీ” అనే షో ప్రోమో విడుదలైంది.. అందులో సుమ చాలా హుషారుగా యాంకరింగ్ చేసింది. చివర్లో సుమ కన్నీళ్లు పెట్టుకుంది. ” నేను మళయాళీ ని. కానీ తెలుగు వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలను” అంటూ ఆస్కార్ రేంజ్ లో ప్రదర్శన ఇచ్చింది.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక విరామం తప్పదు అని ముక్తాయించింది.. ఈ ప్రోమో బాగా పేలింది. ఆ షో కు కావలసినంత ప్రచారం లభించింది. కానీ ఇంత చూసిన తర్వాత ఎక్కడో అనుమానం.. రేటింగ్స్ కోసమేనా అని అనుకుంటుంటే… అది నిజమే అనిపించింది. దాన్ని సుమే రివిల్ చేసింది.

ఫ్రాంక్…ఫ్రాంక్..
టీవీ షో ల టీ ఆర్ పీ పెంచేందుకు నెత్తి మాసిన దర్శకులు, రైటర్లు ఫ్రాంక్ వీడియోలు, కాల్స్ సృష్టిస్తారు. అవి సేఫ్ గా ల్యాండ్ అవుతాయని నమ్ముతారు. కానీ అన్నిసార్లు అలా జరగదు. కొన్నిసార్లు అవి ఎదురు తంతాయి. ఇప్పుడు సీనియర్ యాంకర్ సుమ ది కూడా అదే పరిస్థితి. యూట్యూబ్ స్టోరీల థంబ్ నెయిల్స్ లాగా టీవీల ప్రోమో లు కూడా ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తాయి..పట్టిస్తున్నాయి కూడా. దీనివల్ల సదరు యాంకర్లు, యాక్టర్ల ఇజ్జత్ మొత్తం పోతూ ఉంటుంది. క్రెడిబిలిటీ కూడా పోతుంటుంది.. డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదనుకుంటారు. కానీ ఈ జాబితాలో టీవీల్లో పెద్దగా కనిపించని ఆ ఆంటీయే నయం. ఈ విషయంలో సుమ ఏం అతీతం కాదు. అందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది..”వేర్ ఈజ్ ది పార్టీ” ప్రోమో లో వెళ్ళిపోతున్నా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న సుమ.. తర్వాత హఠాత్తుగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ” నేను ఎక్కడికి వెళ్లడం లేదు. హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. నేను పుట్టిందే బుల్లితెర కోసం.. మీకు వినోదాన్ని ఇవ్వడం కోసం” అంటూ కథలు చెప్పింది.. అంతేకాదు మళ్లీ హఠాత్తుగా ఆ వీడియో డిలీట్ చేసింది.

నెటిజన్లను తక్కువ అంచనా వేసింది
ప్రేక్షకులు ఎవరైనా సరే ఎంత ఓన్ చేసుకుంటారో… తేడా వస్తే అంత కిందికి దించుతారు.. ఈ సువిశాల భారత దేశంలో ఎంతోమంది స్టార్లు అటు ప్రేక్షకులు, ఇటు నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్నవారే. ఇందుకు సుమ మాత్రం మినహాయింపా ఏమిటి? సుమ పోస్ట్ చేసిన ఆ వీడియోను స్క్రీన్ షాట్ తీసి, పబ్లిష్ చేసి, మళ్లీ ఆట మొదలుపెట్టారు.. ఇంతటి ఎపిసోడ్ లో ఏం చెప్పాలనుకున్నది? ఏం చేయాలనుకున్నది? అసలు నేను వెళ్ళిపోతున్న అని ఏడవడం దేనికి? అబ్బే అది నిజం కాదు, నమ్మకండి అని, మళ్ళీ ఆ ఏడుపుకు కౌంటర్ దేనికి? పోనీ చెప్పిందే అనుకుందాం.. మళ్లీ ఆ వీడియో డిలీట్ దేనికి.. మాతో ఆడుకుంటున్నావా అంటూ నెటిజన్ల ట్రోలింగ్.. సుమ అయినంత మాత్రాన వారు ఎందుకు మినహాయింపు ఇస్తారు? అన్నట్టు ఆ టీఆర్ పీ మాయలో పడి చివరకు సుమ కూడా ఇలా మారిపోయిందా?!