Riya Kumari Jharkhand: జార్ఖండ్ నటి రియా కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను దొంగలు తలపై తుపాకీతో కాల్చి హత్య చేశారు. భర్త ముందే ఈ సంఘటన జరిగింది. హౌరా నేషనల్ హైవే 16 పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా సీన్ తరహాలో జరిగిన ఈ మర్డర్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జార్ఖండ్ నుండి రియా కుమారి భర్త ప్రకాష్ కుమార్,రెండేళ్ల పాపతో పాటు కారులో కలకత్తా వెళుతున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న ప్రకాష్ కుమార్ మార్గం మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఆపారు.

ఆ సమయంలో ముగ్గురు దుండగులు ప్రకాష్ కుమార్ పై దాడికి దిగారు. అతని దగ్గర ఉన్న డబ్బులు, బంగారు వస్తువులు లాక్కొంటుండగా… రియా కుమారి ప్రతిఘటించారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒక దుండగుడు రియా కుమారి పాయింట్ బ్లాక్ లో షూట్ చేశారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. డబ్బులు, విలువైన వస్తువులు తీసుకొని ముగ్గురు దొంగలు అక్కడి నుండి పారిపోయారు.
డిసెంబర్ 28 బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి నుండి హెల్ప్ కోసం మూడు కిలోమీటర్లు కోసం ప్రయాణం చేసినట్లు ప్రకాష్ కుమార్ తెలిపారు. షూట్ చేయబడిన రియా కుమారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాష్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

అయితే రియా కుమారిని భర్త ప్రకాష్ కూడా పథకం ప్రకారం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రియా హత్యా సంఘటన గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పలు అనుమానాలకు కారణం అవుతుంది. ప్రకాష్ కుమార్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. రియా కుమారి మర్డర్ ని ఆయన ఇలా తెలివిగా ప్లాన్ చేశాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. రియా స్థానిక భాషలో నటిగా ఉన్నారు. ఆమె భర్త ప్రకాష్ కుమార్ నిర్మాత అని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు నిజాలు బయటకు రానున్నాయి.