https://oktelugu.com/

Anchor Suma: కొడుకు కోసం చేయరాని పనులు చేస్తున్న యాంకర్ సుమ

వారంలో ఏడు రోజులు ఫుల్ బిజీగా మారిపోయింది ఈ యాంకర్. ఈమె భర్త రాజీవ్ కనకాల, సుమ ఇద్దరు కూడా మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఈ జంట తమ కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 6, 2023 / 02:54 PM IST
    Follow us on

    Anchor Suma: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటుంది సుమ కనకాల. మంచి టాకింగ్ పవర్, చమక్కులు చేస్తూ, అందంతో ఇండస్ట్రీని ఏలుతుంది. తన యాంకరింగ్ తో ఇట్టే కట్టిపడేస్తుంటుంది. మాట తీరుతో మైమరిపిస్తుంది. ఇలా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా మాత్రమే కొనసాగేది కానీ ఇప్పుడు సుమ లేని ఈవెంట్, ప్రమోషన్ కార్యక్రమాలు ఉండటం లేదు.

    వారంలో ఏడు రోజులు ఫుల్ బిజీగా మారిపోయింది ఈ యాంకర్. ఈమె భర్త రాజీవ్ కనకాల, సుమ ఇద్దరు కూడా మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఈ జంట తమ కుమారుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పటికే ఓ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు సుమ కుమారుడు రోషన్. ఆయన కోసం సుమ భారీగా కష్టపడుతుంది. అయితే రోషన్ బబుల్ గమ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సుమ ఏ ఈవెంట్ కు వెళ్లినా కొడుకును వెంటేసుకొని వెళ్తుంది. వరుణ్ తేజ్ రిసెప్షన్ లో కూడా తన కుమారుడితో కలిసి వెళ్ళింది ఈ యాంకరమ్మ.

    కుమారుడి సినిమా త్వరలోనే రాబోతుండడంతో ప్రమోషన్స్ ను తన భుజాల వేసుకుందట సుమ. ఇక రోషన్ నటించిన సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేసింది సుమ. సుమ పెద్దగా డాన్స్ చేయదు. కానీ తన కుమారుడి కెరీర్ కోసమే ఈ పని చేసిందని తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది. జిలేబీ అనే పాటకు స్టెప్పులు వేస్తూ అలరించింది. అయితే ఇందులో ఆమె పక్కన డాన్స్ చేసిన వారు సుమ కంటే చెత్తగా చేశారు. దీంతో సుమకు చాలా తెలివి ఉందని.. అందుకే వారిని పక్కన పెట్టుకొని డాన్స్ చేసిందని ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు సుమక్క నువ్వు ముసలమ్మవు అయ్యావు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద దేని గురించి ఆలోచించకుండా సుమ చేసే ఈ ప్రమోషన్స్ ఫలించి కొడుకు సినిమా హిట్ అవుతుందో? ఫట్ మంటుందో చూడాలి.