Anchor Suma America Temple Visit: అమెరికాలో ఓ గుడిని సందర్శించిన యాంకర్ సుమ కనకాల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మన దేశంలో ఉండే సాంప్రదాయ టెంపుల్స్ కి భిన్నంగా కొన్ని విషయాలు ఆ గుడిలో ఆమె చూశారు. ఆ సంగతులు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది..
యాంకర్ సుమ కనకాల(ANCHOR SUMA KANAKALA) ఈ మధ్య షోలు తగ్గించారు. రెండు దశాబ్దాలుగా సుమకు తిరుగు లేదంటే అతిశయోక్తి కాదు. సుమతో పాటు యాంకర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ, ఉదయభాను ఫేడ్ అవుట్ అయ్యారు. ఇక అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి గ్లామరస్ యాంకర్స్ ఎంట్రీ ఇచ్చినా సుమ హవా తగ్గలేదు. ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్, షోలు ఎక్కడ చూసిన సుమనే ఉండేవారు. ఓ బడా స్టార్ సంపాదన ఆమె సొంతం. సుమకు హైదరాబాద్ లో కోట్ల విలువ చేసే లగ్జరీ హౌస్ ఉందట. అక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయట.
కాగా సుమ ఈ మధ్య షోలు తగ్గించారు. సుమ అడ్డా తో పాటు ఒకటి రెండు షోలలో ఆమె సందడి చేస్తున్నారు. నటుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. అబ్బాయి రోషన్ కనకాల హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ టైటిల్ తో ఇంటెన్స్ లవ్ డ్రామా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం మరో చిత్రం చేస్తున్నాడు రోషన్. హీరోగా కొడుకుని నిలబెట్టాలని సుమ గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది సుమ. సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగాక సెలెబ్స్ అందరూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు పంచుకుంటున్నారు. కాగా సుమ అమెరికా వెళ్లారట. అక్కడ ఓ గుడిని సుమ సందర్శించారు. ఆ గుడిలోని సదుపాయాలను చూసి సుమ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడం సాంప్రదాయం. ఒకప్పుడు ప్రతి గుడి ఎదుట బావులు ఉండేవి. తర్వాత వాటి స్థానంలో పంపులు వచ్చాయి. ఇప్పుడు టాప్స్ వాడుతున్నారు.
Also Read: చైనాలో ఉచిత విద్య ఈ స్థాయిలో.. వందేళ్లయినా మనకు కష్టమే
అమెరికా గుడిలో కూడా భక్తులు కాళ్లు కడుక్కోవడానికి ట్యాప్ ఉంది. అందులో వేడి నీటి సౌకర్యం కూడా ఉంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే… ట్యాప్ పక్కనే డ్రైయర్ ఉంది. కాళ్ళు కడుక్కున్నాక డ్రైయర్ తో ఆరబెట్టుకోవచ్చు. మన గుడులలో లేని స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. భారతీయ ఆలయాల్లో ఉండే భక్తుల రద్దీ రీత్యా డ్రైయర్ వంటి పరికరాలు వర్క్ అవుట్ అవకపోవచ్చు. అదన్నమాట సంగతి. సుమ షేర్ చేసిన వీడియో మీద మీరు కూడా ఓ లుక్ వేయండి…